Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 తిమోతికి 1:18 - తెలుగు సమకాలీన అనువాదము

18 తిమోతీ, నా కుమారుడా! నీ గురించి ఇదివరకే చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి నేను ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 నా కుమారుడవైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 తిమోతీ, నా కుమారుడా! నీ గురించి ఇదివరకే చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి నేను ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 తిమోతీ, నా కుమారుడా! నీ గురించి ఇదివరకే చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి నేను ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 తిమోతికి 1:18
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

పౌలు దెర్బేకు వచ్చి అక్కడి నుండి లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతి అనే పేరుగల విశ్వాసిని కలుసుకున్నాడు. అతని తల్లి క్రీస్తును విశ్వాసించిన యూదురాలు మరియు తండ్రి గ్రీసు దేశస్థుడు.


ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసుక్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.


ఎవరైనా తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో సేవ చేస్తారా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివారు ఎవరు? మందను పోషిస్తూ వాటి పాలు త్రాగనివారు ఎవరు?


తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు.


విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది: తండ్రియైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరం, సమాధానములు కలుగును గాక.


ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యదార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.


సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహింపబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.


కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కనుక మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేనిని తిరస్కరించాల్సిన అవసరం లేదు.


తిమోతీ, నీకు అప్పగించబడిన బోధను జాగ్రత్తగా పాటించు. దుష్టమైన వట్టి మాటలకు, జ్ఞానమని తప్పుగా పిలువబడే విరుద్ధమైన ఆలోచనలకు దూరంగా ఉండుము.


నా ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరం, సమాధానములు కలుగును గాక.


నేను మంచి పోరాటం పోరాడి, విశ్వాసాన్ని కాపాడుకొని, నా పరుగు పందాన్ని ముగించాను.


విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు, తీతుకు: మన తండ్రియైన దేవుని నుండి, రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక.


నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కొరకు నిన్ను వేడుకుంటున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ