Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 థెస్సలొనీకయులకు 4:9 - తెలుగు సమకాలీన అనువాదము

9 ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కనుక మీలో ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కాబట్టి మీలో ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కాబట్టి మీలో ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 థెస్సలొనీకయులకు 4:9
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించాలి.’


కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు.


నమ్మినవారందరు ఒకే మనస్సుతో ఐక్యతతో కలిసి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్న వాటన్నింటిని అందరు పంచుకున్నారు.


ప్రేమలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి.


ప్రభువు ప్రజలకు చేస్తున్న పరిచర్య గురించి నేను మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.


కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాం. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు.


సహోదరీ సహోదరులారా, యేసు క్రీస్తు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఆ కాలాలు, సమయాల గురించి మేము మీకు వ్రాయాల్సిన అవసరం లేదు,


“ఆ కాలం తరువాత నేను వారితో చేసే నిబంధన ఇదే అని ప్రభువు చెప్పారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను.”


సహోదరీ సహోదరులుగా, ఒకరిని ఒకరు ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి.


చివరిగా, మీరందరు, ఏక మనస్కులు, సానుభూతి కలవారై ఉండి, పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయం కలవారై ఉండండి.


అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.


దైవ భక్తికి సోదర భావాన్ని; సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి.


తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిని అభ్యంతరం కలిగించేది ఏది వారిలో ఉండదు.


మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి


ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.


కనుక దేవుని ప్రేమించే ప్రతివారు తమ సహోదరుని సహోదరిని కూడ ప్రేమించాలి అనేదే క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ