Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 థెస్సలొనీకయులకు 4:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కనుక, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతోపాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతోకూడ వెంటబెట్టుకొని వచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించినవాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతో పాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతో పాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 థెస్సలొనీకయులకు 4:14
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయన ఎన్నుకొన్న వారిని పోగుచేస్తారు.


ఈ కారణంగానే, క్రీస్తు తాను మరణించినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి ఆయన మరణించి తిరిగి సజీవంగా లేచారు.


యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన, నాశనమయ్యే మీ శరీరాలకు కూడా జీవాన్ని ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు.


మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.


సహోదరీ సహోదరులారా, చనిపోయినవారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మీరు నిరీక్షణ లేని ఇతరుల్లా దుఃఖించకండి.


ఆ తరువాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోవడానికి ఆకాశమండలానికి మేఘాల మీద తీసుకుపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము.


సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ గురించి మనం ఆయనను కలుసుకొనుట గురించి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే,


జీవించు వాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడు, ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా అధికారంలోనే ఉన్నాయి.


అప్పడు పరలోకం నుండి ఒక స్వరం, ఈ విషయాన్ని వ్రాసి పెట్టు: “ఇప్పటి నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు!” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, వారు ప్రయాసం నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ