Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 పేతురు 1:3 - తెలుగు సమకాలీన అనువాదము

3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3-4 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 పేతురు 1:3
56 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ పిల్లలు శరీర కోరికల వలన, లేక మానవుల నిర్ణయాల వలన లేక భర్త కోరిక వలన పుట్టలేదు, కాని దేవుని మూలంగా పుట్టారు.


నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.


పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగివుండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.


యేసు క్రీస్తు మన పాపాల కొరకు మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు.


ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడ్డాం. మనము ఈ సమాధానాన్ని పొందినవారిగా ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాం.


యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన, నాశనమయ్యే మీ శరీరాలకు కూడా జీవాన్ని ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు.


ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. అప్పటికే కలిగివున్న వాటికొరకు ఎవరు నిరీక్షిస్తారు?


విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచివుంటాయి. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే.


ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు.


మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు.


ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి.


మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం మరియు ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.


మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. పరలోక మండలాల్లో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో క్రీస్తులో ఆయన మనలను దీవించారు.


దేవుని కృపా ఐశ్వర్యానికి అనుగుణంగా ఆయనలో మనం ఆయన రక్తం ద్వారా విడుదల, పాపక్షమాపణ కలిగియున్నాము.


అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి


మనలో పని చేసి తన శక్తిని బట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి,


అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.


యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియచేయబడింది.


దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసుక్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము.


సహోదరీ సహోదరులారా, చనిపోయినవారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మీరు నిరీక్షణ లేని ఇతరుల్లా దుఃఖించకండి.


మన ప్రభువైన యేసుక్రీస్తును మన తండ్రియైన దేవుడు మనలను ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి,


మన ప్రభువు యొక్క కృప, యేసుక్రీస్తులోని ప్రేమ, విశ్వాసం నాపై విస్తారంగా క్రుమ్మరించబడింది.


స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది.


అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహం.


ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.


కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి.


మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.


ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు.


నూతనంగా జన్మించిన శిశువుల్లా ఆధ్యాత్మిక పాల కొరకై అపేక్షించండి, దాన్ని త్రాగడం వలన మీరు పెరిగి పెద్దవారై రక్షించబడతారు,


మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైన ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతోను సమాధానం చెప్పండి.


ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది, శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.


ఎలాగంటే, భక్తిరాండ్రయిన పూర్వకాలపు స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకొంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు,


ఆయన నీతిమంతుడని మీరు ఎరిగివుంటే, నీతిని జరిగించే ప్రతి ఒక్కరు ఆయన మూలంగా పుట్టారని మీరు తెలుసుకుంటారు.


ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే, తనను పవిత్రునిగా చేసుకుంటారు.


దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కనుక వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కనుక పాపం చేయలేరు.


ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కనుక మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కనుక వారు దేవుణ్ణి ఎరిగినవారు.


యేసే క్రీస్తు అని విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టినవారే. తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయన కుమారుని కూడా ప్రేమిస్తారు.


దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కనుక దుష్టుడు వారిని ముట్టలేడు.


దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ