Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 యోహాను 4:4 - తెలుగు సమకాలీన అనువాదము

4 ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్న వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళకన్నా గొప్పవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 యోహాను 4:4
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇప్పుడు లోకానికి తీర్పుతీర్చే సమయం. ఇది ఈ లోకాధికారిని తరిమి వేసే సమయం.


నేను మీతో ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఈ లోకాధికారి వస్తున్నాడు. కానీ అతనికి నా మీద అధికారం లేదు.


మరియు ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు గనుక తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు.


అప్పుడు నీవే నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకం తెలుసుకుంటుంది.


అయితే ఈ విషయాలకు ప్రతిస్పందనగా మనం ఏం చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపుంటే, మనకు విరోధంగా ఎవరుండగలరు?


ఏది కాదు, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.


దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాం.


“ఆహారం కడుపు కొరకు, కడుపు ఆహారం కొరకు నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తాడు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కొరకు కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే.


దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనుబరచే సువార్త వెలుగును వారు చూడకుండా ఈ యుగసంబంధమైన దేవత, అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది.


దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? కాబట్టి మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు ఇలా చెప్పారు: “నేను వారితో నివసిస్తాను వారి మధ్య నడుస్తాను, నేను వారి దేవునిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”


మీరు వీటిలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మార్గాలను, అవిధేయులైన వారిలో ఇప్పుడు పని చేస్తున్న ఆత్మ అయిన వాయుమండల అధిపతిని అనుసరించేవారు.


అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని,


చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై యుండండి.


నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు.


తండ్రులారా, నేను మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే, ఆది నుండి ఉన్న వానిని మీరు ఎరుగుదురు. యవ్వనస్థులారా, నేను మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే, మీరు దుష్టుని జయించారు.


మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము.


దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నాడని మనకు తెలుస్తుంది.


మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.


ప్రేమ మనకు తెలుసు మరియు మనం దానిపైన ఆధారపడుతున్నాం. దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు.


కాని మనం దేవునికి చెందినవారము, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కనుక సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనం గుర్తిస్తాము.


మనం దేవుని పిల్లలమని, లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉన్నదని మనకు తెలుసు.


దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే.


వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది మీద విజయం పొందారు; వారు చావడానికి వెనుకంజ వేయాల్సినంతగా వారు తమ ప్రాణాలను ప్రేమించలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ