Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 యోహాను 3:21 - తెలుగు సమకాలీన అనువాదము

21 ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యం కలిగివుంటాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యంగా ఉంటాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యంగా ఉంటాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 యోహాను 3:21
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

వీటి గురించి మీకు గల నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి శిక్ష పొందనివారు దీవించబడినవారు.


నా మనస్సాక్షి నన్ను ఖండించకపోయినా, అది నన్ను నిర్దోషిగా తీర్చదు. నన్ను తీర్పు తీర్చేది ప్రభువే.


ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితీతో, దేవుడు అనుగ్రహించు పవిత్రతతో మేము నడుచుకొన్నాము, లోకజ్ఞానంపై ఆధారపడకుండా దేవుని కృపపై ఆధారపడి నడుచుకొన్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.


ఈ విధంగా ఇప్పుడు ఆయనలో మరియు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము.


కనుక ప్రతిచోట పురుషులు పవిత్రమైన చేతులను పైకెత్తి, కోపం లేదా కలహభావం లేకుండా ప్రార్థించాలని నేను కోరుతున్నాను.


కనుక మన హృదయంలోని దోషాలు తొలగిపోయేలా శుద్ధిచేసుకొని, మన శరీరాలను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచుకొని, నిష్కపటమైన హృదయంతో విశ్వాసం వల్ల కలిగే పూర్తి నమ్మకంతో దేవుని సమీపిద్దాం.


కావున మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాం.


కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగివుండునట్లు, మీరు ఆయనలో కొనసాగండి.


ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు, ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే.


ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, ఆయన యదార్థరూపంను మనం చూస్తాము గనుక, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము.


మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము.


తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండునట్లు దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము.


మనం దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు మనకు ఉండే నమ్మకం ఇదే: ఆయన చిత్తప్రకారం మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ