Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 కొరింథీ 3:12 - తెలుగు సమకాలీన అనువాదము

12 ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12-13 ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్య కాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 కొందరు బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి ఈ పునాది మీద కడతారు. మరికొందరు చెక్కను, గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 కొరింథీ 3:12
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడానికి సత్యాన్ని మళ్ళించే వారు మీ సొంతవారిలో నుండే బయలుదేరుతారు.


సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకొన్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించుమని వేడుకొంటున్నాను, వారికి దూరంగా ఉండండి.


ఎందుకంటే వేయబడిన పునాది యేసు క్రీస్తే, వేసిన పునాది కాకుండా మరొక పునాదిని ఎవరూ వేయలేరు.


ఆ న్యాయదినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టం చేయబడుతుంది. అది అగ్ని చేత నిరూపించబడుతుంది, ప్రతి ఒక్కరి పనిలోని నాణ్యత అగ్ని చేత పరీక్షించబడుతుంది.


మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కొరకు అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన యెదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని మాకు తెలుసు.


అయితే రహస్యమైన సిగ్గుపడాల్సిన పనులను విడిచిపెట్టాము; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని నాశనం చేయం. దానికి విరుద్ధంగా, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం.


క్రీస్తుపై కాకుండా, మానవ ఆచార సాంప్రదాయాలు ఈ లోకసంబంధమైన మూల నియమాలపై ఆధారపడిన మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్తపడండి.


మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మంచి ఉపదేశాలకు మన దైవభక్తిని పెంచే బోధకు వ్యతిరేకమైన బోధను ఎవరైనా బోధిస్తే,


ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి.


అయితే దుష్టులు, వంచకులు ఇతరులను మోసం చేస్తూ తామే మోసపోతూ మరింతగా చెడిపోతారు.


ఈ స్త్రీలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు కాని సత్యాన్ని ఎన్నడు గ్రహించలేరు.


ఎందుకంటే, ప్రజలు మంచిబోధను అంగీకరించని ఒక సమయం వస్తుంది. అప్పుడు వారు తమ సొంత ఆశలకు అనుగుణంగా తమ దురద చెవులు వినడానికి ఇష్టపడే వాటినే బోధించే అనేకమంది బోధకులను తమ చుట్టూ చేర్చుకుంటారు.


అన్ని రకాల వింత బోధలచేత దూరంగా వెళ్లిపోకండి. ఆచార సంబంధమైన ఆహారం తినడం వల్ల కాదు, కాని కృప చేత మన హృదయాలు బలపరచబడటం మంచిది; ఆచారాలను పాటించే వారికి ఏ ప్రయోజనం కలుగదు.


అవి మీ విశ్వాసం యదార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం కూడ అగ్ని చేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటె ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి, అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది, దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి.


అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసివుంది: అవేమనగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, జారత్వం చేసేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు.


ఆ గోడ సూర్యకాంత మణులతో కట్టబడింది. ఆ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో చేయబడి గాజులా స్వచ్ఛముగా ఉంది.


నీవు ధనవంతునివి అయ్యేలా అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని, అవమానకరమైన నీ దిగంబరత్వం కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని, నీకు చూపు కలుగడానికి నీ కళ్ళకు మందును నా దగ్గర కొనుక్కో అని నేను నీకు సలహా ఇస్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ