Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 కొరింథీ 12:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 ఒకరికి ఆత్మ ద్వారా జ్ఞాన సందేశం ఇవ్వబడింది, అదే ఆత్మ ద్వారా మరొకరికి విజ్ఞత సందేశం ఇవ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 కొరింథీ 12:8
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు యేసు వారితో, “ఎందుకంటే పరలోక రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు.


కనుక సహోదరి సహోదరులారా, ఆత్మతో మరియు జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము.


నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను.


దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.


దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కనుక,


నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగివున్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగివున్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.


ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది.


సహోదరీ సహోదరులారా, మేము ఇక ఏమి చెప్పాలి? మీరు సమావేశమైనప్పుడు, మీలో ఒకరు కీర్తన పాడాలని, ఒకరు బోధించాలని, ఒకరు దేవుడు బయలుపరచిన దాన్ని ప్రకటించాలని, ఒకరు భాషలతో మాట్లాడాలని, ఒకడు దానికి అర్థం చెప్పాలని తలస్తున్నారు. కాని ఇవన్ని సంఘాన్ని కట్టడానికి చేయము.


కనుక సహోదరీ సహోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షతను లేదా జ్ఞానం లేదా ప్రవచనం లేదా వాక్య బోధ మీకు చెప్పకపోతే నేను వచ్చి భాషలలో మాట్లాడడం వల్ల నా నుండి మీకు ఏ మంచి జరుగుతుంది?


ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు.


ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకొని ఆయనకు బోధింపగలవారు ఎవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.


ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితీతో, దేవుడు అనుగ్రహించు పవిత్రతతో మేము నడుచుకొన్నాము, లోకజ్ఞానంపై ఆధారపడకుండా దేవుని కృపపై ఆధారపడి నడుచుకొన్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.


మాట్లాడడంలో నేను నేర్పులేని వాన్ని కావచ్చు కాని జ్ఞానంలో కాదు. అన్ని విధాలుగా మేము దీన్ని మీకు పూర్తిగా స్పష్టం చేసాము.


కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.


“చీకటి నుండి వెలుగు కలుగును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింజేసారు.


పవిత్రతలో, అవగాహనలో, ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;


అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో అన్నిటిలో సమృద్ధిగలవారే, కనుక మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా సమృద్ధి గలవారుగా ఉండేలా చూసుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ