Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 కొరింథీ 12:11 - తెలుగు సమకాలీన అనువాదము

11 ఇవన్ని ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరికి వాటిని పంచి ఇస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 కొరింథీ 12:11
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషం.


నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అధికారం లేదా? లేక నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.


అందుకు యోహాను ఈ విధంగా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వారికి ఇవ్వబడితేనే గాని ఏ వ్యక్తి పొందుకోలేడు.


గాలి తనకు ఇష్టమైన చోట వీస్తుంది, దాని శబ్దం వినగలవు కానీ అది ఎక్కడ నుండి వస్తుందో లేదా ఎక్కడికి వెళ్తుందో చెప్పలేవు. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అంతే” అన్నారు.


తండ్రి ఎలాగైతే చనిపోయినవారిని లేపి జీవమిస్తారో, కుమారుడు కూడా తాను ఇవ్వాలనుకున్న వారికి జీవాన్ని ఇస్తారు.


మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగివున్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు.


కనుక దేవుడు ఎవరిపై తాను కనికరాన్ని చూపదలిచాడో వారిపైన కనికరాన్ని చూపుతాడు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నాడో వారి పట్ల కఠినంగా ఉంటాడు.


అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదానిని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచాడు.


అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని పంచిపెట్టే ఆత్మ ఒక్కడే.


అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే.


ప్రభువు తమను ఏ స్థితి నుండి పిలిచాడో, ప్రతి ఒక్కరు ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలలో నియమిస్తున్నాను.


మీరందరు నాలా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, మీలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాడు; ఒకరికి ఒక వరం, ఇంకొకరికి ఇంకొక వరాన్ని ఇచ్చాడు.


మేమైతే పరిమితికి మించి పొగడుకోం, అయినా, దేవుడు మాకు కొలిచి ఇచ్చిన హద్దులలోనే ఉన్నాము, ఆ హద్దులో మీరు కూడా ఉన్నారు.


దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి, క్రీస్తులో ముందుగా నిరీక్షించిన మనము, తన మహిమకు కీర్తి తీసుకురావాలని నిర్ణయించి, ఆయన మనలను తన వారసులుగా ఏర్పరచుకున్నారు.


అయితే ప్రతి ఒక్కరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది.


సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు, వివిధరకాల అద్బుతాలు, తన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ వరాలను పంచిపెట్టడం ద్వారా దేవుడు కూడా వాటి గురించి సాక్ష్యమిచ్చారు.


ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ