Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 కొరింథీ 1:9 - తెలుగు సమకాలీన అనువాదము

9 తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 తన కుమారుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్థుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 కొరింథీ 1:9
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆకాశం మరియు భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏ మాత్రం గతించవు.


మరియు నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలాగా తండ్రీ, నీవు నాలో, నేను నీలో ఏకమై ఉన్నట్లు వారు కూడా ఒకటిగా ఉండాలి. నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా వారు మనలో కూడా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.


అయితే ఒలీవ చెట్టు కొమ్మలు కొన్ని విరిచివేయబడినప్పుడు, నీవు అడవి ఒలీవ చెట్టు కొమ్మవైనప్పటికిని, నీవు మిగిలిన కొమ్మల మధ్యలో అంటుకట్టబడి, ఆ ఒలీవ చెట్టు వేరు నుండి వచ్చే సారంలో పాలుపొందినప్పుడు


దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి కొరకు అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు.


ఎవరిని ముందుగా నిర్ణయించారో, వారిని ఆయన పిలిచారు; ఆయన పిలిచిన వారిని, ఆయన నీతిమంతులుగా తీర్చారు; ఆయన నీతిమంతులుగా తీర్చిన వారిని, ఆయన మహిమపరిచారు.


అనగా యూదుల నుండి మాత్రమే కాకుండా యూదేతరుల నుండి కూడా ఆయనచే పిలువబడినవారమైన మనకొరకు తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి?


దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.


సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దాని కంటె ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకొనే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.


మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకోవడమే కదా? మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో పాలుపంచుకోవడమే గదా?


అయితే దేవుడు నమ్మదగినవాడైతే, నేను మీకు చేసిన వాగ్దానం “అవునని” చెప్పితే “కాదు” అనేలా ఉండదు.


కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు,


నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారుని యందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.


ఈ రహస్యం ఏమిటంటే, సువార్త ద్వారా యూదేతరులు ఇశ్రాయేలుతో కలిసి వారసులు, ఒకే శరీరంలోని సభ్యులు, మరియు క్రీస్తు యేసులోని వాగ్దానంలో భాగస్వాములు.


మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన బాధలలో మిగిలి వున్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను.


మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.


మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాలుపొందేలా మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు.


అయితే ప్రభువు నమ్మదగినవాడు కనుక ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.


దేవుడు మనల్ని రక్షించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలిచిన పిలుపు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు గాని, ఆయన ప్రణాళిక మరియు కృపను బట్టియే. ఆ కృప సృష్టి ఆరంభానికి ముందే క్రీస్తు యేసు మూలంగా మనకు ఇవ్వబడింది,


మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.


దేవుని సేవకుడు యేసు క్రీస్తు అపొస్తలుడనైన పౌలు అనే నేను, మనమందరం నమ్ముతున్న ఒకే విశ్వాసాన్ని బట్టి నాకు నిజ కుమారుడైన తీతుకు వ్రాయునది,


వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకొందాం.


వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని శారా నమ్మింది కనుక శారాకు పిల్లలను కనే వయస్సు దాటిపోయినా, విశ్వాసం ద్వారానే ఆమె బిడ్డను కనగలిగింది.


దేవుని సేవచేయడంలో కనికరం కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఉండడానికి, ప్రజల పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన అన్ని విధాలుగా వారిలా సంపూర్ణ మానవునిగా చేయబడ్డారు.


కనుక, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.


ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకొని వుంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.


దేవుడు అబద్ధమాడడం అసాధ్యమైన రెండు మార్పులేని విషయాల ద్వారా, మన ముందు ఉంచిన నిరీక్షణను పట్టుకోవడానికి పరుగెత్తిన మనలను ఎంతో ప్రోత్సహించగలిగేలా, దేవుడు ఇలా చేశారు.


తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంత కాలం బాధలు పొందిన తరువాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.


తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడ మాతో చేరేలా, మేము చూచిన వాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము.


అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము, ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనలను శుద్ధి చేస్తుంది.


మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.


అప్పడు పరలోకం తెరవబడి, నా ముందు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద సవారీ చేసే వ్యక్తి నమ్మకమైన సత్యవంతుడు అని పిలువబడతాడు. ఆయన న్యాయమైన తీర్పును ఇస్తూ యుద్ధం చేస్తాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ