Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 కొరింథీ 1:18 - తెలుగు సమకాలీన అనువాదము

18 ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 కొరింథీ 1:18
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ ‘చూడండి, ఎగతాళి చేసేవారలారా, ఆశ్చర్యపడి నశించిపోయేవారలారా వినండి, నేను మీ కాలంలో ఒక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి మీకు ఎవరు వివరించినా దానిని మీరు నమ్మలేరు.’”


ఎపికూరీయ అనే గుంపువారు మరియు స్తోయికులలో కొందరు జ్ఞానులు పౌలుతో వాదించసాగారు. వారిలో కొందరు, “ఈ వాగుబోతు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు?” అన్నారు. మరికొందరు, “ఇతడు మనకు తెలియని దేవతలను గురించి బోధిస్తున్నాడు” అన్నారు. పౌలు యేసును గురించిన సువార్తను మరియు పునరుత్థానంను గురించి బోధించడం వలన వారు అలా అన్నారు.


వారు మరణం నుండి తిరిగి లేవడం గురించి విన్నప్పుడు, కొందరు హేళన చేయసాగారు కాని మరికొందరు, “ఈ సంగతిని గురించి మేము మరలా వినాలని అనుకుంటున్నాం” అన్నారు.


వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతి దినము రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.


సువార్త గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే, నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తరువాత యూదేతరులకు రక్షణ కలుగచేయడానికి సువార్త దేవుని శక్తి.


దేవుని జ్ఞానం ప్రకారం, లోకం తన జ్ఞానంతో దేవునిని తెలుసుకోలేదు, సువార్తను ప్రకటించే వెర్రితనం ద్వారా నమ్మినవారిని రక్షించడం దేవునికి ఇష్టమైనది.


నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేనిచో, మీరు వ్యర్థంగా నమ్మారు.


అయితే, ఆత్మ లేనివారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కనుక, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు,


నేను మీతో ఉన్నప్పుడు సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియచేయకూడదని నిశ్చయించుకున్నాను.


ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. లేఖనాలలో: “జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొంటాడు” అని వ్రాయబడి ఉంది.


మేము క్రీస్తు కొరకు బుద్ధిహీనులం, కాని మీరు క్రీస్తులో తెలివైన వారు! మేము బలహీనులం, కాని మీరు బలవంతులు! మీరు గౌరవం పొందారు, మేము అవమానం పొందాం!


మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు, కాని కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు.


ఒకవేళ మేము బోధించే సువార్త, ఎవరికైనా ముసుగుగా ఉంటే, అది నశించేవారికి మాత్రమే ముసుగుగా ఉంటుంది.


ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు.


అతడు నశించువారిని అన్ని విధాలుగా దుష్టత్వంతో మోసగిస్తాడు, వారు రక్షణ పొందడానికి గాని సత్యాన్ని ప్రేమించడానికి నిరాకరించారు కనుక వారు నశిస్తారు.


మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాం. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చునివున్నారు.


దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరుచేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ