Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 కొరింథీ 1:10 - తెలుగు సమకాలీన అనువాదము

10 సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ యదార్థమైన ఏక మనస్సుతో, ఒకే ఆలోచనతో ఒకే భావంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 కొరింథీ 1:10
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, ఎందుకంటే ఆ బట్ట, పాత బట్ట నుండి విడిపోయి చినుగును మరి ఎక్కువ చేస్తుంది.


“ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, అలా చేస్తే, క్రొత్త బట్టముక్క పాత బట్ట నుండి విడిపోయి చినుగును మరి ఎక్కువ చేస్తుంది.


ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు.


ఈ మాటల వలన యూదులలో మరల భేదాలు ఏర్పడ్డాయి.


అప్పుడు నీవే నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకం తెలుసుకుంటుంది.


ఈ విధంగా క్రీస్తును గురించి ప్రజలలో విభేదాలు ఏర్పడ్డాయి.


పరిసయ్యులలో కొందరు, “ఇతడు సబ్బాతు దినాన్ని పాటించడంలేదు. కనుక ఇతడు దేవుని నుండి రాలేదు” అన్నారు. కానీ మరికొందరు ఒక పాపి ఇలాంటి అద్బుత క్రియలను ఎలా చేయగలుగుతాడు? అన్నారు. కనుక వారిలో భేదాలు ఏర్పడ్డాయి.


నమ్మినవారందరు ఒకే మనస్సుతో ఐక్యతతో కలిసి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్న వాటన్నింటిని అందరు పంచుకున్నారు.


సహోదరీ సహోదరులారా, యూదేతరుల మధ్యలో నేను కలిగియున్నట్లుగా, మీ మధ్యలో కూడా కోత కలిగియుండాలని నేను మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించాను, గాని అలా జరుగకుండా ఇప్పటి వరకు నేను నిరోధించబడ్డాను అనే విషయం మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.


కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.


ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం కలిగి ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం కలిగి ఉండవద్దు.


సహోదరీ సహోదరులారా, నా కొరకు దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నా పోరాటంలో చేరాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను.


సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకొన్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించుమని వేడుకొంటున్నాను, వారికి దూరంగా ఉండండి.


నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేసారు.


మొదటి విషయం, మీరు దేవుని సంఘంగా ఒకచోట చేరినప్పుడు మీలో విభేదాలు ఉన్నాయని నేను విన్నాను, ఇది కొంతవరకు నేను నమ్ముతున్నాను.


అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగివుండడానికి ఆయన అలా చేశారు.


మీరు ఇంకా లోకస్థులుగానే ఉన్నారు. మీలో అసూయ, కొట్లాటలు ఉన్నాయి కనుక మీరు శరీర స్వభావంతో సాధారణ మానవుల్లా జీవించడంలేదా?


కనుక, నన్ను అనుకరించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను.


క్రీస్తు యొక్క వినయం సౌమ్యతను బట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలు అనే నేను, మీతో ముఖాముఖిగా ఉన్నపుడు “పిరికివాడిని” కాని మీకు దూరంగా ఉన్నపుడు “ధైర్యశాలిని.”


చివరిగా, సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగివుండండి, సమాధానం కలిగి జీవించండి, ప్రేమ సమాధానాలకు కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.


మేము బలహీనంగా ఉన్నా మీరు బలంగా ఉంటేనే మాకు సంతోషం. మీరు సంపూర్ణంగా పునరుద్ధరించబడాలని మేము ప్రార్థిస్తున్నాము.


అందువల్ల మేము, దేవుడు మా ద్వారా విజ్ఞప్తి చేసే క్రీస్తు రాయబారులం. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాము.


దేవుని తోటి పనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం.


సహోదరీ సహోదరులారా, నేను మీలా మారినట్లే మీరూ నాలా మారాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీరు నా పట్ల ఏ తప్పు చేయలేదు.


ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేక నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కొరకు మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన.


అయినా ఇప్పటి వరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాం.


వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి.


సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ గురించి మనం ఆయనను కలుసుకొనుట గురించి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే,


ఎటువంటి పక్షపాతాన్ని చూపించకుండా, ఎవరి పట్ల భేదం చూపకుండా నీవు ఈ సూచనలు పాటించాలని, దేవుని యెదుట క్రీస్తు యేసు సన్నిధిలో ఏర్పరచబడిన దేవదూతల యెదుట నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.


నేను దేవుని యెదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు యెదుట నీకు ఇచ్చే ఆజ్ఞ యిదే:


ప్రియ మిత్రులారా, ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కనుక వాటికి విడిచిపెట్టండి.


తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంత కాలం బాధలు పొందిన తరువాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ