Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 8:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 “సమాధానమనే విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, ద్రాక్షచెట్టు తన ఫలాన్ని ఇస్తుంది, భూమి తన పంటను ఇస్తుంది, ఆకాశం మంచు కురిపిస్తుంది. ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారికి వీటన్నిటిని వారసత్వంగా ఇస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 సమాధానసూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు కాపు కాస్తాయి. భూమి పంటలనిస్తుంది. ఆకాశం నుండి మంచు కురుస్తుంది. ఈ ప్రజల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను ఆస్తిగా ఇస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 “సమాధానమనే విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, ద్రాక్షచెట్టు తన ఫలాన్ని ఇస్తుంది, భూమి తన పంటను ఇస్తుంది, ఆకాశం మంచు కురిపిస్తుంది. ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారికి వీటన్నిటిని వారసత్వంగా ఇస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 8:12
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు విత్తాడు, యెహోవా అతన్ని దీవించారు కాబట్టి, అదే సంవత్సరం అతనికి నూరంతల పంట వచ్చింది.


దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి యొక్క సారాన్ని, సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.


గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”


పర్వతాలు ప్రజలకు వృద్ధిని, కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక.


యెహోవా మేలైనది అనుగ్రహిస్తారు, మన భూమి తన పంటనిస్తుంది.


రాజు కోపం సింహగర్జన వంటిది, అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది.


మీరు భూమిలో నాటే విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తారు. ఆ భూమి నుండి వచ్చే ఆహారం గొప్పగా, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున మీ పశువులు విశాలమైన మైదానాల్లో మేస్తాయి.


మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు బదులుగా మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు. మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు, శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది.


వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, వారు ఇకపై విచారించరు.


వారు ఇకపై దేశాలచేత దోచుకోబడరు, అడవి మృగాలకు వారు ఆహారం కారు. వారు క్షేమంగా జీవిస్తారు, వారిని ఎవరూ భయపెట్టరు.


నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు.


చెట్ల ఫలాలను, పొలాల పంటను వృద్ధి చేస్తాను, అప్పుడు కరువు కారణంగా ఇతర ప్రజల ముందు మీకు అవమానం కలుగదు.


నేను మీ పక్షంగా ఉండి మీమీద దయ చూపిస్తాను; మీరు దున్నబడి, విత్తబడతారు.


కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు, ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు, నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు, కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు.


నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను; అతడు తామరలా వికసిస్తాడు. లెబానోను దేవదారు చెట్టులా అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి;


యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు: “నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి, ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను; ఇక ఎన్నడూ మిమ్మల్ని దేశాల్లో అవమానానికి గురిచేయను.


అడవి జంతువులారా, భయపడకండి, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లు పచ్చగా మారుతున్నాయి. చెట్లు తమ ఫలాలు ఇస్తాయి. అంజూర చెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.


“ ‘ఒకవేళ మీరు నా శాసనాలు పాటిస్తూ, నా ఆజ్ఞలకు లోబడడానికి జాగ్రత్త వహిస్తే,


ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు; వారు అబద్ధాలు చెప్పరు. మోసపూరిత నాలుక వారి నోళ్లలో ఉండదు. వారు తిని పడుకుంటారు వారికి ఎవరి భయం ఉండదు.”


కాబట్టి మీ కారణంగా ఆకాశం నుండి మంచు కురవలేదు భూమి పంటలు పండలేదు.


‘మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నుండి, తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజు నుండి, అంటే యెహోవా ఆలయ పునాది వేయబడిన రోజు నుండి జరిగిన వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించండి:


గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”


సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ సమయంలో ఈ ప్రజల్లో మిగిలిన ఉన్నవారికి ఇది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు కాని నాకు ఆశ్చర్యంగా ఉంటుందా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.


మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను, అవి మీ పొలం పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల పండ్లు అకాలంలో రాలవు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.


కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.


కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే.


నా ఉపదేశం వర్షంలా కురుస్తుంది నా మాటలు మంచు బిందువుల్లా దిగుతాయి, లేతగడ్డి మీద జల్లులా, లేత మొక్కల మీద సమృద్ధి వర్షంలా ఉంటుంది.


యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా అతని భూమిని ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;


కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు; ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది, అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.


శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ