Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 4:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అందుకతడు, “ఈ ఇద్దరూ సర్వలోక ప్రభువు దగ్గర నిలబడి సేవ చేయడానికి అభిషేకించబడ్డవారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అతడు–వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అతడు “వీరిద్దరూ సర్వలోకనాధుడైన యెహోవా దగ్గర నిలిచి తైలం పోసే సన్నిధాన సేవకులు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 “ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అందుకతడు, “ఈ ఇద్దరూ సర్వలోక ప్రభువు దగ్గర నిలబడి సేవ చేయడానికి అభిషేకించబడ్డవారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 4:14
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”


అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు.


“మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు.


“నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”


నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను; నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.


అభిషేక తైలాన్ని తీసుకుని అతని తలపై పోసి అతన్ని అభిషేకించాలి.


నాకు యాజక సేవ చేయటానికి వారి తండ్రిని అభిషేకించినట్లే వారిని కూడా అభిషేకించాలి. వారి అభిషేకం యాజకత్వానికి గుర్తుగా తరతరాలకు కొనసాగుతుంది.”


నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.


నిన్ను సృష్టించినవాడే నీ భర్త ఆయన పేరు సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; ఆయన భూమి అంతటికి దేవుడు.


“యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


అహరోనును ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంచెం అతని తలమీద పోశాడు.


“సీయోను కుమార్తె, లేచి, కళ్ళం త్రొక్కు, నేను నీకు ఇనుప కొమ్ములు ఇస్తాను; ఇత్తడి డెక్కలు ఇస్తాను. నీవు అనేక దేశాలను ముక్కలుగా విరగ్గొడతావు.” నీవు వారి అన్యాయపు సంపదను యెహోవాకు సమర్పిస్తావు. వారి ఆస్తులను సర్వలోక ప్రభువుకు సమర్పిస్తావు.


యెహోవా మందిరాన్ని కట్టేవాడు అతడే; అతడు వైభవాన్ని కలిగి సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు. అతడు తన సింహాసనం మీద యాజకునిగా ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య సమాధానకరమైన ఆలోచన ఉంటుంది.’


దూత నాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఇవి సర్వలోక ప్రభువు సన్నిధి నుండి బయలుదేరిన నాలుగు పరలోకపు ఆత్మలు.


అందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను.


నేటి వరకు చేస్తున్నట్లుగా, యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవ చేయడానికి, ఆయన పేరిట ఆశీర్వచనం పలకడానికి లేవీ గోత్రికులను ఆ సమయంలో యెహోవా ప్రత్యేకించుకున్నారు.


చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది.


లోకమంతటికి ప్రభువైన యెహోవా మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యొర్దానులో అడుగు పెట్టగానే, దిగువకు ప్రవహిస్తున్న ప్రవాహం తెగిపోయి ఒకవైపు రాశిగా నిలబడతాయి.”


వారు “రెండు ఒలీవచెట్లు” రెండు దీపస్తంభాలుగా ఉన్నారు; “వారు భూలోకానికి ప్రభువైనవాని ఎదుట నిలబడి ఉన్నారు.”


అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు.


యెహోవా సమూయేలుతో, “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను” అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ