Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 11:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 గొర్రెల కాపరుల ఏడ్పు వినండి; వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి! సింహాల గర్జన వినండి; యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 గొఱ్ఱె బోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యొర్దానుయొక్క మహారణ్యము పాడైపోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 గొర్రెల కాపరుల రోదన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. కొదమ సింహాల గర్జన వినబడుతున్నది. ఎందుకంటే యొర్దాను లోయలోని అడవులు పాడైపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 విలపించే కాపరుల రోదనను వినండి. శక్తివంతులైన వారి నాయకులు పట్టుబడ్డారు. యువకిశోరాల గర్జన వినండి. యొర్దాను నదివద్దగల వాటి చిక్కటి పొదలన్నీ తీసుకుపోబడ్డాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 గొర్రెల కాపరుల ఏడ్పు వినండి; వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి! సింహాల గర్జన వినండి; యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 11:3
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

సింహాల నోటి నుండి నన్ను కాపాడండి; అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి.


వారి గర్జన సింహగర్జనలా ఉంది. కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు కాపాడే వారెవరు ఉండరు.


నేను ఏర్పరచుకున్నవారు వారి శాపవచనాల్లో మీ పేరును ఉపయోగిస్తారు; ప్రభువైన యెహోవా మిమ్మల్ని చంపుతారు. ఆయన తన సేవకులకు మరొక పేరు పెడతారు.


సింహాలు గర్జించాయి; అవి అతని మీదికి గుర్రుమన్నాయి. వారు అతని దేశాన్ని పాడుచేశారు; అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.


“నేను వ్యర్థంగా నీ పిల్లలను శిక్షించాను; వారు దిద్దుబాటుకు స్పందించలేదు. నీ ఖడ్గం నీ ప్రవక్తలను, బాగా ఆకలిగా ఉన్న సింహంలా చంపింది.


నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”


“యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


మోసపూరిత మాటలను నమ్మకండి, “ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!”


“ ‘నీ తల్లి ఎలాంటిది అంటే సింహాల మధ్యలో ఆడసింహం లాంటిది. కొదమ సింహాల మధ్య పడుకుని తన పిల్లలను పెంచింది.


సమరయలో నివసించే ప్రజలు, బేత్-ఆవెనులో ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. దాని ఘనత పోయిందని దాని ప్రజలు దుఃఖపడతారు, దాని వైభవం గురించి ఆనందించిన దాని యాజకులు ఏడుస్తారు.


యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి; బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి. నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా, రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి; ఎందుకంటే దేవుని మందిరంలోకి భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.


“ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.


“ఆ దినాన యెరూషలేములో ఉన్న చేప ద్వారం నుండి ఏడుపు, పట్టణ దిగువ భాగం నుండి రోదన, కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ఆ దినాన యెరూషలేమా, నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు, ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారిని నేను నీలో నుండి తొలగిస్తాను. నా పరిశుద్ధ కొండపై ఇంకెప్పుడు నీవు గర్వపడవు.


దానిలో ఉన్న అధికారులు గర్జించే సింహాలు; దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ, ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు.


సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; మహా వృక్షాలు నాశనమైపోయాయి! బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: దట్టమైన అడవి నరకబడింది.


ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను తీసివేశాను. మంద నన్ను అసహ్యించుకుంది; నేను వారిని చూసి విసిగిపోయి,


వారిని వదిలిపెట్టండి; వారు గ్రుడ్డి మార్గదర్శకులు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే, వారిద్దరు గుంటలో పడతారు” అన్నారు.


మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ