Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 11:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 –మీకు అనుకూలమైనయెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 11:12
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు.


కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు.


అహాబు నాబోతుతో, “నీ ద్రాక్షతోట నా భవనానికి దగ్గర ఉంది కాబట్టి, నీ ద్రాక్షతోటను నాకు ఇవ్వు, నేను దానిని కూరగాయల తోటగా వాడుకుంటాను. దానికి బదులుగా, నీ తోట కంటే ఇంకా మంచి ద్రాక్షతోటను నీకు ఇస్తాను, లేదా నీకిష్టమైతే దానికి తగిన వెల చెల్లిస్తాను” అన్నాడు.


“కాబట్టి నా కోసం లెబానోనులో దేవదారు చెట్లను నరకమని ఆదేశాలు ఇవ్వండి. నా పనివారు మీ పనివారితో కలసి పనిచేస్తారు, మీ పనివారికి మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంత మీకిస్తాను, ఎందుకంటే సీదోనీయుల్లా మ్రాను నరికే నిపుణులు మా దగ్గర లేరని మీకు తెలుసు.”


ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది.


ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.


కాబట్టి నేను అనాతోతులో ఉన్న పొలాన్ని నా బంధువైన హనామేలు దగ్గర కొని, అతనికి పదిహేడు షెకెళ్ళ వెండి తూకం వేసి ఇచ్చాను.


స్త్రీలకు వెల ముప్పై షెకెళ్ళ వెండి నిర్ణయించాలి;


“తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.


“నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు.


ఈ విధంగా యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన: “వారు ముప్పై వెండి నాణేలు తీసుకున్నారు, అవి ఇశ్రాయేలీయులు ఆయనకు కట్టిన విలువ, ప్రభువు నన్ను ఆదేశించిన ప్రకారం, వారు ఆ డబ్బుతో కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు,” అనే ప్రవచనం నెరవేరింది.


వారు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు, అప్పటికే యేసును అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది ప్రేరేపించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ