Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 10:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 నేను వారికి ఈలవేసి పిలిచి వారిని సమకూరుస్తాను. ఖచ్చితంగా నేను వారిని విమోచిస్తాను; వారు మునుపటిలా అనేకులుగా ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను,మునుపు విస్తరించినట్లువారు విస్తరించుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 నేను వారిని విమోచించాను కనుక ఈల వేసి పిలిచి వాళ్ళను సమకూరుస్తాను. ఇంతకు ముందు విస్తరించినట్టు వాళ్ళు అభివృద్ది చెందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 “నేను వారికొరకు ఈల వేసి, వారందరినీ ఒక్కచోటికి పిలుస్తాను. నేను వారిని నిజంగా రక్షిస్తాను. వారి సంఖ్య విస్తారంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 నేను వారికి ఈలవేసి పిలిచి వారిని సమకూరుస్తాను. ఖచ్చితంగా నేను వారిని విమోచిస్తాను; వారు మునుపటిలా అనేకులుగా ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 10:8
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదా, ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారంగా ఉండి తిని త్రాగుతూ సంతోషిస్తూ ఉన్నారు.


అయితే ఇశ్రాయేలీయులు అత్యధికంగా ఫలించారు; వారు గొప్పగా విస్తరించారు, అభివృద్ధి చెందారు, వారి సంఖ్య అంతకంతకు అభివృద్ధి పొంది వారున్న ప్రదేశం వారితోనే నిండిపోయింది.


మేఘం విడిపోవునట్లు నీ దోషాలను ఉదయకాలపు మంచు మబ్బు తొలగిపోయేలా నీ పాపాలను, తుడిచివేశాను. నేను నిన్ను విడిపించాను. నా దగ్గరకు తిరిగి రా.”


బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.


ఆయన దూరంగా ఉన్న దేశాలను పిలువడానికి జెండా ఎత్తుతారు, భూమి అంచుల్లో ఉన్నవారిని రప్పించడానికి ఈల వేస్తారు. చూడండి వారందరు తొందరగా, వేగంగా వస్తున్నారు.


యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.


ఆ రోజున ఈజిప్టులో నైలు నది పాయల నుండి ఈగలను, అష్షూరు దేశం నుండి కందిరీగలను యెహోవా ఈలవేసి పిలుస్తారు.


అవన్నీ వచ్చి మెట్ట కనుమలలో, రాళ్ల పగుళ్లలో, ముళ్ళపొదల్లో, పచ్చికబయళ్లలో నివసిస్తాయి.


నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ”


“అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.


“యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను; నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను. నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను, ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది.


నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను.


“భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరందరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.


“రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.


ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ