Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 6:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ప్రియా, నువ్వు తిర్సా పట్టణమంత సౌందర్య రాశివి. నీది యెరూషలేమంత సౌందర్యం. నీ అందం చూసి నేను మైమరచి పోతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైనదానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 6:4
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యరొబాము భార్య లేచి బయలుదేరి తిర్సాకు వెళ్లింది. ఆమె గడపలో అడుగుపెట్టిన వెంటనే ఆ బాలుడు చనిపోయాడు.


బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు.


యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.


మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.


దేవుడు ఆమె కోటలలో ఉన్నారు; ఆయనే దానికి కోట అని చూపించారు.


సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, దేవుడు ప్రకాశిస్తారు.


నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.


యెరూషలేము కుమార్తెలారా, నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని, కేదారు డేరాలవంటిదానను, సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని.


బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము.


నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం; నీలో ఏ కంళంకమూ లేదు.


నేను నిద్ర పోతున్నానన్న మాటే గాని, నా హృదయం మేలుకొని ఉంది. వినండి! నా ప్రియుడు తలుపు తడుతూ: “తలుపు తియ్యి, నా సోదరీ, నా ప్రియురాలా! నా పావురమా, నిష్కళంకురాలా. నా తల మంచుకు తడిసింది, రాత్రి తేమకు నా వెంట్రుకలన్నీ తడిసిపోయాయి.”


తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?


నీ దారిన వెళ్లేవారంతా నిన్ను చూసి, చప్పట్లు కొడతారు; వారు యెరూషలేము దిక్కు చూసి ఎగతాళిగా తలలాడిస్తూ ఇలా అంటారు: “పరిపూర్ణ సౌందర్య పట్టణమని, సమస్త భూనివాసులకు ఆనంద కారణమని ఈ పట్టణాన్ని గురించేనా చెప్పుకున్నారు?”


భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు.


మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు. కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు.


దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.


అప్పుడు తన భర్త కోసం అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ