Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 6:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! మహనాయీము నాట్యాన్ని చూసినట్లు మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 షూలమ్మీతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) అందాల రాశీ, వెనక్కి తిరిగి రా. వచ్చెయ్యి. తిరిగి వచ్చెయ్యి. నేను నిన్ను తనివితీరా చూడాలి. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) రెండు వరసల నర్తకిల మధ్య నేను నాట్యం చేస్తున్నట్టు నావైపు అంత తదేకంగా ఎందుకు చూస్తావు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యము చేస్తూండగా షూలమ్మీతీని ఎందుకు చూస్తారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! మహనాయీము నాట్యాన్ని చూసినట్లు మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 6:13
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము అని పెట్టారు.


రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.


దావీదు మహనయీముకు చేరుకున్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలీయులతో కలిసి యొర్దాను నది దాటి వెళ్లిపోయారు.


షాలేములో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.


నల్లపిల్ల అని చెప్పి నన్నిలా తేరిచూస్తారేమి? ఎండకు నేను నల్లగా అయ్యాను. నా తల్లి కుమారులకు నా మీద కోపం నన్ను ద్రాక్షతోటను కావలి కాయడానికి పెట్టారు; అందుకే నా సొంత ద్రాక్షతోటను కాయలేక పోయాను.


బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము.


నేను గ్రహించేలోపే, నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది.


“ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,


“విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి. మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను.” “అవును, మేము మీ దగ్గరకు వస్తాము, ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా.


అలాగే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగిన ఒక పాపిని గురించి దేవుని దూతల మధ్య సంతోషం కలుగుతుంది అని మీతో చెప్తున్నాను” అన్నారు.


తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోడానికి నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు గాని, ఈమె తన కన్నీటితో నా పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది.


ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడ నేను తోడుకొని రావాలి. అవి కూడా నా స్వరం వింటాయి, అప్పుడు ఒక్క మంద ఒక్క కాపరి ఉంటాడు.


ఆయన అతనితో, “వెళ్లు, సిలోయము అనే కోనేటిలో కడుక్కో” అని చెప్పారు. సిలోయము అనగా, “పంపబడిన” అని అర్థము. అతడు వెళ్లి కడుక్కుని చూపుతో ఇంటికి వచ్చాడు.


దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే.


కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది.


శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.


ఆయన వచ్చే దినాన తన పరిశుద్ధ ప్రజలమధ్య మహిమను కనుపరచుకున్నప్పుడు ఆయనను నమ్మినవారందరు ఆశ్చర్యంగా ఆయనను చూస్తారు. మేము మీకు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించారు కాబట్టి మీరు కూడా వారిలో ఉంటారు.


అబ్రాహాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనగా మొదట, “నీతికి రాజు అని అర్థం” అటు తర్వాత “షాలేము రాజు” అనగా, “శాంతికి రాజు” అని అర్థం


వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ