Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 2:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, ఆయన ఫలం నా రుచికి మధురము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు. ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను. అతని పండు ఎంతో రుచిగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు అడవిచెట్ల మధ్య జల్దరు చెట్టులా ఉన్నావు! ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను! నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని ఫలం నాకెంతో రుచికరంగా వుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, ఆయన ఫలం నా రుచికి మధురము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 2:3
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు మనుష్యుల్లో అత్యంత అద్భుతమైనవారు మీ పెదవులపై దయ నిండి ఉంది, దేవుడు మిమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తారు.


బలాఢ్యుడా, మీ ఖడ్గాన్ని నడుముకు కట్టుకోండి; వైభవం ప్రభావాలను ధరించుకోండి.


నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. విపత్తు గడిచేవరకు నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను.


అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు? దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు?


మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.


నా ప్రియుడా! నీవు ఎంత సౌందర్యమూర్తివి! ఓ, నీవు ఎంతో అందమైనవాడవు! మనకు పడక ప్రశాంతము.


ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి, ఆపిల్ పండ్లతో తినిపించండి. ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను.


నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో,


ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక.


ఆయన నోరు అతిమధురం; ఆయన మనోహరము. యెరూషలేము కుమార్తెలారా! ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.


పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది, నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి, నీకోసం వాటిని దాచి వుంచాను, క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి.


బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది; అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు. దాని ఫలానికి ఒక్కొక్కడు వెయ్యి వెండి షెకెళ్ళ శిస్తు చెల్లించాలి.


కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది; సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి. వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు గిట్టుతాయి.


తన ప్రియుని ఆనుకుని అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.


మీరు పేదవారికి ఆశ్రయంగా ఉన్నారు, అవసరతలో ఉన్నవారికి తమ బాధలో మీరు ఆశ్రయంగా ఉన్నారు, తుఫానులో ఉన్నవారికి ఆశ్రయంగా, వేడి నుండి తప్పించే నీడగా ఉన్నారు. ఎందుకంటే, క్రూరుల శ్వాస గోడకు తాకే తుఫానులా,


వారిలో ప్రతి ఒక్కరు గాలి వీచినప్పుడు దాక్కునే స్థలంలా తుఫానులో ఆశ్రయంగా ఎడారిలో నీటి ప్రవాహాల్లా ఎండిన భూమిలో ఒక గొప్ప కొండ నీడలా ఉంటారు.


ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది.


అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.


నదికి ఇరువైపులా అన్ని రకాల పండ్లచెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారవు, వాడిపోతాయి వాటి కొమ్మలపై ఎల్లప్పుడూ పండ్లు ఉంటాయి. దేవాలయం నుండి ప్రవహించే నది ద్వారా వాటికి నీరు అందుతుంది కాబట్టి ప్రతి నెల క్రొత్త పంట ఉంటుంది. పండ్లు ఆహారంగా ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి.”


ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.


మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు.


“ముళ్ళపొద చెట్లతో, ‘మీరు నిజంగా నన్ను మీ రాజుగా అభిషేకించాలనుకుంటే రండి, నా నీడలో ఆశ్రయం తీసుకోండి; లేదా ముళ్ళపొద నుండి అగ్ని వచ్చి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును గాక!’ అన్నది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ