Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 1:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే, మందల అడుగుజాడలను బట్టి వెళ్లు, కాపరుల డేరాల ప్రక్కన నీ మేక పిల్లలను మేపుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 (తన ప్రియుడు ఆమెకు జవాబిస్తున్నాడు) జగదేక సుందరీ, నీకు తెలియకపోతే నా మందల అడుగుజాడలను అనుసరించు. కాపరుల డేరాల దగ్గర నీ మేకపిల్లలను మేపుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 నీవు అంత అందమైనదానవు! కనుక నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో. వెళ్లు, గొర్రెలను వెంబడించు. నీ చిన్న మేకల్ని కాపరుల గుడారాల వద్ద మేపు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే, మందల అడుగుజాడలను బట్టి వెళ్లు, కాపరుల డేరాల ప్రక్కన నీ మేక పిల్లలను మేపుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 1:8
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”


రాజు నీ అందానికి పరవశించును గాక; ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు.


అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి.


ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా వాకిటి దగ్గర కాచుకుని నా బోధను వినే మనుష్యులు ధన్యులు.


నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.


నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా.


నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! ఓ, ఎంత అందం! మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి.


నా సోదరీ, నా వధువా, నీ ప్రేమ ఎంత ఆహ్లాదకరం! ద్రాక్షరసం కంటే నీ ప్రేమ ఆనందమయం, నీవు పూసుకున్న పరిమళ తైల సువాసన సుగంధ ద్రవ్యాలన్నిటినీ మించింది!


నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం; నీలో ఏ కంళంకమూ లేదు.


స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి? ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు, ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి?


స్త్రీలలో అత్యంత అందమైనదానా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి.


యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’


వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. అతడు, “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అయితే, “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు.


నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి.


దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.


దేవుని వాక్యాన్ని మీకు బోధించిన మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత విధానం వలన కలిగిన ఫలితాన్ని తెలుసుకోండి, వారి విశ్వాసాన్ని అనుకరించండి.


అంతేగాక, మీరు సోమరులుగా ఉండక, విశ్వాసం, ఓర్పు ద్వారా వాగ్దానం చేయబడినదానికి వారసులైన వారిని మీరు అనుకరించాలని మేము కోరుతున్నాము.


మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు తాను చేసిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పబడలేదా?


అలాగే వేశ్యయైన రాహాబు దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపివేసినప్పుడు తాను చేసిన క్రియలనుబట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా?


సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి.


అదే విధంగా శారా అబ్రాహాముకు లోబడి అతడిని యజమాని అని పిలిచింది. మీరు మంచి పనులు చేస్తూ దేనికి బెదరని వారైతే ఆమెకు పిల్లలవుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ