Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 9:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 మరియు యెషయా ముందు చెప్పినప్రకారము– సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు: “సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని మనకు వదిలి ఉండక పోయినట్లైతే మనం సొదొమ ప్రజలవలే, గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

29 యెషయా గతంలో చెప్పినట్లుగా, “సర్వశక్తిమంతుడైన ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనము సొదొమ వలె మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారం.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 9:29
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి; గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి.


సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.


అప్పుడు రాజ్యాలకు వైభవంగా, బబులోనీయుల గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును సొదొమ గొమొర్రాల వలె దేవుడు పడగొడతారు.


దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా అది కూడా నాశనమవుతుంది. అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత మొద్దులు ఎలా మిగులుతాయో అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.”


సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత అక్కడ ఎవరూ నివసించనట్లే; ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు.


సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా చేసిన తర్వాత, అక్కడ ఎవరూ నివసించనట్లే, ఇక్కడ కూడా ఎవరూ నివసించరు” అని యెహోవా అంటున్నారు.


యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.


సొదొమ శిక్ష కంటే నా ప్రజల శిక్ష గొప్పది, ఆమెకు సహాయం చేయడానికి చేయి లేకుండానే క్షణాల్లో పడగొట్టబడింది.


“నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు మీలో కొంతమందిని పడగొట్టాను. మీరు మంటలో నుండి లాగివేసిన కట్టెలా ఉన్నారు, అయినా మీరు నా వైపుకు తిరగలేదు, అని యెహోవా అంటున్నారు.


సముద్రతీరాన ఉన్న దేశం, గొర్రెల కాపరులకు పచ్చికబయళ్లుగా అవుతుంది; బావులు, మందల కోసం దొడ్లు ఉంటాయి.


దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది.


చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి.


దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని కాల్చి బూడిద చేసి భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు.


అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ