Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 4:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు గాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమను చెల్లించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 4:20
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచారు.


అంతకుముందు, ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా కూడా, ఇది జరుగుతుందా?” అని అన్నాడు. దైవజనుడు జవాబిస్తూ, “నీవు నీ కళ్లారా చూస్తావు కాని దానిలో ఏమి తినవు” అన్నాడు.


రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు. అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు.


భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”


ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, సమరయకు రెమల్యా కుమారుడు రాజు. మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే మీరు క్షేమంగా ఉండలేరు.”


“నీవు ఎంతో విలువైనవాడవు, భయపడకు, సమాధానం! ఇప్పుడు ధైర్యం తెచ్చుకో! ధైర్యం తెచ్చుకో!” అని అతడు అన్నాడు. అతడు నాతో మాట్లాడినప్పుడు నేను బలపరచబడ్డాను, “నా ప్రభువా, మీరు నాకు బలం కలిగించారు, కాబట్టి మాట్లాడండి” అని అన్నాను.


అతడు దుర్మార్గమైన పనులు చేస్తూ పొగడ్తలతో నిబంధనను అతిక్రమించేవారిని తన వశం చేసుకుంటాడు, అయితే తమ దేవున్ని తెలుసుకున్నవారు కదలక అతన్ని ఎదిరిస్తారు.


అయితే యెహోవా చెప్పేదేమంటే, ‘జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో! ప్రధాన యాజకుడవును యెహోజాదాకు కుమారుడవునైన యెహోషువా, ధైర్యం తెచ్చుకో! దేశ ప్రజలారా, మీరందరూ ధైర్యం తెచ్చుకోండి! నేను మీకు తోడుగా ఉన్నాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.


యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.”


సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే.


జనసమూహం అది చూసి, వారు భయంతో నిండుకొని, మానవునికి ఇలాంటి అధికారాన్ని ఇచ్చిన దేవుని స్తుతించారు.


అందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు.


ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది.


మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.


అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.


చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.


నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు.


అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ