Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 2:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 వాళ్ళ ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు కొన్నిసార్లు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్లు నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

15 ధర్మశాస్త్రానికి కావలసినవి తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు, అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది, వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 2:15
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

‘ఆమె నా సోదరి’ అని అతడు చెప్పలేదా? ‘ఇతడు నా అన్న’ అని ఆమె కూడా చెప్పలేదా? నేను నిర్మలమైన మనస్సాక్షితో నిర్దోషిగా ఉండి దీన్ని చేశాను” అని అన్నాడు.


రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.


నేను నా నిర్దోషత్వాన్ని కొనసాగిస్తాను దానిని ఎప్పటికీ వదలను; నేను బ్రతికిన కాలమంతా నా మనస్సాక్షి నన్ను నిందించదు.


ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు.


వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది.


పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు.


కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.


ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు.


శారీరకంగా సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నవారు, ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగి ఉన్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు.


నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది.


ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితితో, దేవుడు ఇచ్చే పవిత్రతతో మేము నడచుకున్నాము. లోకజ్ఞానంపై ఆధారపడక దేవుని కృపపై ఆధారపడి నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.


అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మేమేంటో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నేను నమ్ముతున్నాను.


కాలుతున్న ఇనుము చేత కాల్చబడిన మనస్సాక్షి కలిగిన వంచకులైన అబద్ధికుల నుండి అలాంటి బోధలు వస్తాయి.


ఎందుకంటే, పవిత్రులకు అన్ని పవిత్రంగానే ఉంటాయి కాని, నమ్మనివారికి, చెడిపోయినవారికి ఏది పవిత్రంగా ఉండదు. నిజానికి అలాంటివారి మనస్సులు, మనస్సాక్షి కూడా చెడిపోయాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ