Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 11:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 దేవుడు చూపించే దయను, కఠినత్వాన్ని తెలుసుకోండి: పడిపోయిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నారు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశారు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్నయెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఆయన ఒక వైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికి వేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 దేవుడు చూపించే దయను, కఠినత్వాన్ని తెలుసుకోండి: పడిపోయిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నారు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశారు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

22 దేవుడు చూపించే దయను కఠినత్వాన్ని తెలుసుకోండి: విరిచి పడవేయబడిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నాడు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశాడు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 11:22
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది!


మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది.


“అయితే నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తూ దుర్మార్గునిలా అసహ్యమైన పనులు చేస్తే వారు బ్రతుకుతారా? వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు. వారు నమ్మకద్రోహంతో చేసిన దోషాలను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి వారు చస్తారు.


“నీతిమంతుడు తన నీతి నుండి తొలగిపోయి చెడు చేస్తే నేను అతని ముందు అభ్యంతరం పెడతాను అప్పుడతడు చస్తాడు. అయితే నీవు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతడు తన పాపాన్ని బట్టి చస్తాడు. అతడు చేసిన నీతిక్రియలను నేను జ్ఞాపకం చేసుకోను, కాని అతని రక్తానికి నిన్నే జవాబుదారీని చేస్తాను.


అయితే మంచి నేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.


నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తారు.


తనను నమ్మిన యూదులతో యేసు, “ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు.


అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు.


శిష్యుల ఆత్మలను బలపరచి విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సాహించారు. “మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక హింసలు పొందాల్సి ఉంది” అని వారు చెప్పారు.


దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా.


పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమ, ఘనత, నిత్యత్వాన్ని వెదికేవారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు.


నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు నమ్మడం వ్యర్థమే.


మంచి చేయడంలో మనం అలసి పోవద్దు ఎందుకంటే మానక చేస్తే తగిన కాలంలో మనం పంటను కోస్తాము.


ఏదో ఒక రీతిగా శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడని, అప్పుడు మేము చేసిన పని అంతా వ్యర్థమై పోతుందని నేను భయపడ్డాను, కాబట్టి ఇక నేను వేచి ఉండలేక మీ విశ్వాసం గురించి తెలుసుకోవాలని తిమోతిని పంపించాను.


ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే.


వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.


ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.


అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహము.


వారు మనలో నుండి బయలుదేరారు, కాని నిజానికి వారు మనకు సంబంధించినవారు కారు. ఎందుకంటే వారు మనకు సంబంధించినవారైతే మనతోనే నిలిచి ఉంటారు; అయితే వారు అలా వెళ్లిపోవడం వల్ల వారిలో ఒక్కరు కూడా మనకు సంబంధించినవారు కారని తెలుస్తుంది.


నీవు ఎంతగా పడిపోయావో గుర్తించు! నీవు పశ్చాత్తాపపడి మొదట చేసిన పనులు చేయి. నీవు పశ్చాత్తాపపడకపోతే నేను నీ దగ్గరకు వచ్చి, నీ దీపస్తంభాన్ని దాని స్థానంలో నుండి తీసివేస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ