ప్రకటన 9:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై స్వారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపురంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు కవచాలను వారు తమ ఛాతీ మీద ధరించి ఉండడం నేను చూశాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నా దర్శనంలో ఈ గుర్రాలను గూర్చీ, వాటి పైన ఉన్న సైనిక దళం గూర్చీ నేనేం చూశానంటే, గుర్రాలూ, సైనికులూ ధరించిన కవచాలు నిప్పులాటి ఎరుపూ, చిక్కటి నీలం, గంధకంలాటి పసుపు రంగుల్లో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి తమ నోళ్ళలో నుండి అగ్ని, పొగ, గంధకం వెళ్ళగక్కుతున్నాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 నాకు కనిపించిన రౌతులు, గుఱ్ఱాలు ఈ విధంగా ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలె ఎరుపు, ముదురు నీలం, గంధకాన్ని పోలిన పసుపు రంగుల్లో ఉన్నాయి. గుఱ్ఱాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్ళనుండి మంటలు, పొగ, గంధకము బయటికి వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై స్వారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపురంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు కవచాలను వారు తమ ఛాతీ మీద ధరించి ఉండడం నేను చూశాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము17 నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై సవారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపు రంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు గల కవచాలు ఛాతి మీద వారు ధరించి ఉండడం నేను చూసాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి. အခန်းကိုကြည့်ပါ။ |