Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 7:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచకుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఈ సంగతులు జరిగిన తరువాత భూమి నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి ఉండడం నేను చూశాను. వారు భూమి మీద నాలుగు వైపుల నుంచి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి వీయడం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద గాలి వీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి వీచే గాలిని పట్టుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

1 ఈ సంగతుల తరువాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి, భూమి మీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 7:1
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.


యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను.


మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు.


నేను ఏలాముకు వ్యతిరేకంగా ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు గాలులను రప్పిస్తాను; నేను వారిని నాలుగు గాలులకు చెదరగొడతాను, చెదిరిపోయిన ఏలాము వారు వెళ్లని దేశమే ఉండదు.


అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఊపిరి వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఊపిరీ! నీవు నాలుగు వైపుల నుండి వచ్చి, ఈ హతులైన వీరి బ్రతికేలా వీరిలో ఊపిరి నింపు.’ ”


“మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే: “ ‘అంతం! అంతం వచ్చేసింది దేశం నలువైపులా వచ్చేసింది!


అతడు పైకి వచ్చిన తర్వాత, అతని సామ్రాజ్యం చీల్చబడి ఆకాశ నలుదిక్కులకు పంచి పెట్టబడుతుంది. అది అతని వారసులకు సంక్రమించదు, లేదా అతడు ఉపయోగించిన అధికారం దానికి ఉండదు ఎందుకంటే, అతని సామ్రాజ్యం పెరికి వేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.


దానియేలు, “రాత్రివేళ నా దర్శనంలో నేను తేరిచూడగా నా ఎదుట ఆకాశం నాలుగు వైపుల నుండి గాలులు వీచి మహా సముద్రాన్ని కదిలించాయి.


మేకపోతు ఎంతో గొప్పగా అయ్యింది, కాని దాని అధికారం ఉన్నత స్థితిలో ఉండగా, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది, దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు పైకి వచ్చి ఆకాశం నాలుగు వైపులకు పెరిగాయి.


అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.


నేను మళ్ళీ పైకి చూస్తే, నా ఎదుట రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతూ కనిపించాయి. అవి ఇత్తడి పర్వతాలు.


దూత నాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఇవి సర్వలోక ప్రభువు సన్నిధి నుండి బయలుదేరిన నాలుగు పరలోకపు ఆత్మలు.


గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయనచేత ఎన్నుకోబడిన వారిని పోగుచేస్తారు.


ఆయన తన దూతలను పంపి, నలుదిక్కుల నుండి, భూమి అంతం నుండి ఆకాశ అంతం వరకు తాను ఏర్పరచుకున్న వారిని పోగుచేస్తారు.


ఆ సాతాను భూమి నలుదిక్కుల ఉన్న దేశాలను గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యుద్ధానికి సమకూర్చడానికి బయలుదేరి వెళ్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా లెక్కకు మించి ఉంది.


ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల యవల గింజలు. అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను.


“మేము మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను.


మొదటి దూత తన బూరను ఊదినప్పుడు రక్తంతో కలిసి ఉన్న అగ్ని వడగండ్లు భూమి మీదికి కురిసాయి. అప్పుడు భూమి మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం కాలిపోయింది, పచ్చని గడ్డంతా కాలిపోయింది.


ఆ స్వరం బూర ఊదిన ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహా నది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పడం విన్నాను.


భూమి మీద మొలిచే గడ్డికి కాని, పచ్చని మొక్కలకు కాని, చెట్లకు కాని హాని చేయకూడదు కాని ఏ మనిషి నుదుటి మీద దేవుని ముద్ర లేదో వానికే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ