Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 19:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు: “ఆమేన్! హల్లెలూయా!” అంటూ ఆరాధించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి–ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు: “ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు: “ఆమేన్! హల్లెలూయా!” అంటూ ఆరాధించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

4 అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి ఆరాధించారు. వారు బిగ్గరగా, “ఆమేన్! హల్లెలూయా!” అని అరిచారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 19:4
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! అని అనగానే ప్రజలంతా, “ఆమేన్, యెహోవాకు స్తుతి” అని చెప్పారు.


నేను కూడా నా బట్టలు దులిపి వారితో, “ఈ విధంగా దేవుడు తమ వాగ్దానాన్ని నెరవేర్చి వారందరిని వారి ఇళ్ళ నుండి ఆస్తినుండి దులిపి వేస్తారు. అప్పుడు వాడు ఏమి లేనివానిగా అవుతాడు” అని చెప్పాను. అప్పుడు అక్కడ సమావేశమైన వారంతా ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా తమ వాగ్దానం ప్రకారం చేశారు.


ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు.


అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు.


ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! ప్రజలంతా, “ఆమేన్!” అనాలి. యెహోవాను స్తుతించండి!


ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతింపబడును గాక! ఆమేన్. ఆమేన్.


ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక; భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక. ఆమేన్ ఆమేన్.


యెహోవాకే నిత్యం స్తుతి కలుగును గాక! ఆమేన్ ఆమేన్.


యిర్మీయా ఇలా అన్నాడు, “ఆమేన్! యెహోవా అలా చేయును గాక! బబులోను నుండి యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులను బందీలుగా తీసుకెళ్లిన వారందరిని తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి నీవు ప్రవచించిన మాటలను యెహోవా నెరవేరుస్తారు.


నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను” అని వారితో చెప్పారు.


మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’


లేకపోతే మీరు ఆత్మలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, మీరు చెప్పిన దాన్ని గ్రహించలేనివారు అక్కడ ఉంటే, మీరు ఏం చెప్పారో వారికి తెలియదు కాబట్టి మీ కృతజ్ఞతా స్తుతికి వారు “ఆమేన్” అని ఎలా చెప్తారు?


అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు.


ఈ సంగతుల తర్వాత పరలోకంలో ఒక గొప్ప జనసమూహం అరుస్తున్న శబ్దం వంటి శబ్దాన్ని నేను విన్నాను: “హల్లెలూయా! రక్షణ, మహిమ, బలం మన దేవునివే!


మరొకసారి వారు ఇలా బిగ్గరగా కేకలు వేశారు: “హల్లెలూయా! ఆమె నుండి వస్తున్న పొగ ఎల్లకాలం పైకి లేస్తూనే ఉంటుంది!”


అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది, “హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నారు.


ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ