Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 17:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆ మృగం నిండా దైవదూషణ పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అప్పుడు నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు, ఊదా రంగుగల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆ మృగం నిండా దైవదూషణ పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

3 అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూసాను. ఆ మృగం దైవదూషణ పేర్లతో కప్పబడి ఉంది; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 17:3
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను మిమ్మల్ని విడిచి వెళ్లిన తర్వాత, యెహోవా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. నేను అహాబుకు చెప్పినప్పుడు, ఒకవేళ అతనికి మీరు కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. అది సరికాదు; మీ సేవకుడనైన నేను కూడ బాల్యం నుండే యెహోవాను ఆరాధించే వాన్ని.


వారు అన్నారు, “చూడండి, మీ సేవకులైన మా దగ్గర సమర్థులైన యాభైమంది మనుష్యులు ఉన్నారు. వారు వెళ్లి మీ గురువును వెదుకుతారు. బహుశ యెహోవా ఆత్మ అతన్ని తీసుకెళ్లి, ఏదైనా కొండమీదో లేదా ఏదైన లోయలోనో వదిలి ఉండవచ్చు” అన్నారు. అందుకు ఎలీషా, “వద్దు, వారిని పంపకండి” అన్నాడు.


తన ప్రియుని ఆనుకుని అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.


దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది. అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది.


ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది.


ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు.


“రాజు తన ఇష్టానుసారంగా చేస్తాడు. తనను తాను ప్రతి దేవునిపైన హెచ్చించుకొని, ఘనపరచుకొని, దేవాది దేవునికి వ్యతిరేకంగా ఎన్నడు వినని విషయాలు మాట్లాడతాడు. ఉగ్రత కాలం పూర్తయ్యే వరకు అతడు వర్ధిల్లుతూ ఉంటాడు, ఎందుకంటే నిర్ణయించబడింది జరగాలి.


దాని తలమీద ఉన్న పది కొమ్ముల గురించి, వాటి మధ్య నుండి లేచిన మొదట ఉన్న మూడు కొమ్ములను పడగొట్టిన చిన్న కొమ్ము గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను. అది ఇతర కొమ్ముల కంటే గంభీరంగా కనిపిస్తూ, కళ్లు, గర్వంగా మాట్లాడు నోరు గలది.


అతడు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధులను హింసిస్తూ, పండుగ కాలాలను, శాసనాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధులు ఒక కాలం, కాలాలు, సగం కాలం అతని చేతికి అప్పగించబడతారు.


“నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి.


వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.


వారు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకెళ్లాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని అతడు సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు.


వాడు దేవునిగా పిలువబడే ప్రతిదాన్ని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చుని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.


ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది.


ఒక కాలం కాలాలు సగకాలం వరకు సర్పానికి అందకుండ తన ఆకలిదప్పులు తీర్చుకొనేలా అరణ్యంలో ఆమె కోసం సిద్ధపరచిన స్థలానికి ఎగిరి వెళ్లడానికి ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి.


అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి.


ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కోసం అరణ్యంలో సిద్ధం చేసిన స్థలానికి ఆమె పారిపోయింది.


నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను యేలుతున్న ఆ మహా పట్టణం” అని చెప్పాడు.


ఆ స్త్రీ ఊదా, ఎరుపురంగు వస్త్రాలను ధరించి, మెరిసే బంగారం, విలువైన రాళ్లు, ముత్యాలతో అలంకరించబడి ఉంది. ఆమె తన చేతితో ఒక బంగారు పాత్ర పట్టుకుని ఉంది. ఆ పాత్ర ఆమె చేసిన అసహ్యమైన పనులు, వ్యభిచారమనే మురికితో నిండి ఉంది.


వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు;


బిగ్గరగా ఇలా రోదించారు, “ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని, బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా,


అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకెళ్లి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు.


వెంటనే నేను ఆత్మవశుడనై ఉండగా నా ముందు పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుని ఉండడం చూశాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ