Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 12:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్ళ క్రింద చంద్రుని, తన తల మీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 12:1
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోవడానికి బబులోను పాలకులు అతని దగ్గరకు రాయబారులను పంపారు. అతని హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవాలని దేవుడు అతన్ని పరీక్షకు విడిచిపెట్టారు.


యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు; ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి


యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; నిందారహితులుగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండ మానరు.


తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?


యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.


నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా, నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు.


కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లు ఆ రోజున వారి దేవుడైన యెహోవా వారిని కాపాడతారు. వారు కిరీటంలోని ప్రశస్తమైన రాళ్లలా ఆయన దేశంలో ఉంటారు.


అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు.


అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు.


“అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు.


ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’


అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి. ఆకాశంలో కూడ భయంకరమైన సంఘటనలు, గొప్ప సూచనలు కనిపిస్తాయి.


“ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి.


పెండ్లికుమార్తె పెండ్లికుమారునికే చెందుతుంది. పెండ్లికుమారుని దగ్గర ఉండి చూసుకునే స్నేహితుడు అతడు ఏమైనా చెబితే వినాలని ఎదురుచూస్తాడు. పెండ్లికుమారుని స్వరాన్ని విన్నప్పుడు అతడు ఎంతో సంతోషిస్తాడు. నా సంతోషం కూడా అలాంటిదే, ఇప్పుడు అది సంపూర్ణమయ్యింది.


నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను.


మీరు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించకండి.


యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు.


దైవికమైన ఆసక్తిని మీ పట్ల నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే, మిమ్మల్ని నేను క్రీస్తు అనే ఏకైక భర్తకు ప్రధానం చేశాను, కాబట్టి పవిత్రమైన కన్యగా మిమ్మల్ని ఆయనకు అప్పగించాలి.


క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు.


కాని పైనుండి వచ్చే యెరూషలేము స్వతంత్రమైనది, ఆమె మనకు తల్లి.


మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము.


ఇది లోతైన మర్మం; అయితే నేను క్రీస్తు సంఘం గురించి చెప్తున్నాను.


నా కుడిచేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రాల గురించి, ఏడు దీపస్తంభాల గురించి మర్మం ఇదే: ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాల ఏడు దూతలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలు.


అప్పుడు పరలోకంలోని దేవాలయం తెరచుకొంది, దేవుని నిబంధన మందసం ఆయన దేవాలయంలో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, తీవ్రమైన వడగండ్ల వాన వచ్చాయి.


అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి.


నేను పరలోకంలో మరొక గొప్ప అద్భుతమైన సూచన చూశాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకుని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది.


పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండుమంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి.


ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ