9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము. నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము. మమ్మల్ని రక్షించుము. నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.
మా పాపాలు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నా, యెహోవా, మీ నామం కోసం ఏదైనా చేయండి. ఎందుకంటే మేము చాలాసార్లు దారితప్పాం; మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాము.
ఇశ్రాయేలీయులారా! మీ దుర్మార్గాన్ని బట్టి మీ చెడు పనులను బట్టి కాకుండా నా నామాన్ని బట్టే మీకు ఇలా చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
అయితే నా నామం కోసం వారిని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. వారు నివసించిన జనాంగాల దృష్టిలో, ఎవరి ఎదుట నన్ను నేను ఇశ్రాయేలీయులకు బయలుపరచుకున్నానో వారి ఎదుట నా పేరు అపవిత్రం కాకూడదని అలా చేశాను.
మీరు నా మాట వినకుండా నా పేరును మనసారా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే, నేను మీ మీదికి శాపం రప్పిస్తాను. మీరు పొందుకున్న దీవెనలను కూడా నేను శాపాలుగా మారుస్తాను. నిజానికి, మీరు నా హెచ్చరికను గుర్తు ఉంచుకోలేదు కాబట్టి నేను ఇప్పటికే వాటిని శాపాలుగా మార్చాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.