Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 76:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు. పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు. భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 76:8
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ప్రజల కోసం యూదా అంతటి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు; మనలను ఉద్దేశించి అందులో వ్రాయబడిన ప్రకారం వారు చేయలేదు.”


యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.


సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు.


నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,


“అధికారం భీకరత్వం దేవునివే; ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు.


“ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.”


యెహోవా మోషేతో, “నీవు ప్రజల దగ్గరకు వెళ్లి ఈ రోజు రేపు వారిని ప్రతిష్ఠించు. వారు తమ వస్త్రాలను ఉతుక్కుని,


అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.


“యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


ఆయన ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోగలరు? ఆయన కోపాగ్నిని ఎవరు సహించగలరు? ఆయన ఉగ్రత అగ్నిలా బయటకు కుమ్మరించబడింది; ఆయన ముందు బండలు బద్దలయ్యాయి.


కాని, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.


సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”


నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి, తమ ఆకాశమార్గాల్లో నుండి సీసెరాతో విరుద్ధంగా పోరాడాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ