Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 73:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను. ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 73:3
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.


యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు; నిర్దోషులు భక్తిహీనులను చూసి ఆందోళన చెందుతారు.


దుష్టులు ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు, పెద్దవారిగా ఎదుగుతూ వారు బలాభివృద్ధి చెందుతున్నారు?


భద్రతా భావనతో ఆయన వారిని విశ్రాంతి తీసుకోనిస్తారు, కాని వారి మార్గాలపై ఆయన దృష్టి ఉంచుతారు.


వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.


దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;


యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.


పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.


చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు;


హింసాత్మకమైనవారిని అసూయ పడకు, వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.


నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను; నీతిమంతులు తమ నీతిలో నశించారు, దుష్టులు తమ దుష్టత్వంలో దీర్ఘకాలం జీవించారు.


యెహోవా, నేను మీ ముందు ఎప్పుడు వాదన వినిపించినా మీరెప్పుడూ నీతిమంతునిగానే ఉంటారు. అయినా మీ న్యాయం గురించి నేను మీతో మాట్లాడతాను: దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? నమ్మకద్రోహులంతా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు?


ఇప్పుడు గర్విష్ఠులనే ధన్యులని పిలుస్తున్నాము. చెడు చేసేవారు వర్ధిల్లుతూ ఉన్నారు, వారు దేవున్ని పరీక్షించినప్పుడు కూడా వారికి ఏ హాని కలగడం లేదు.’ ”


లేదా, “దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కోసం ఆయన ఆరాటపడుతున్నారని” లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ