Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 6:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 6:9
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం మెత్తబడి నిన్ను నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.


నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.


నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు.


నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; మీరు నన్ను ధైర్యపరిచారు.


నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా


“మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” అని నేను ఆందోళన చెందాను. సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు నా విన్నపాన్ని విన్నారు.


“నీవు వెళ్లి హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను.


“మీరు నా మొరను ఆలకించారు, నీ చెవులు మూసుకోకు” అనే నా విన్నపాన్ని మీరు విన్నారు.


అతడు ఇలా ప్రార్థించాడు: “నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు జవాబిచ్చారు. మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను, మీరు నా మొర విన్నారు.


“నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే, యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది, మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ