Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 59:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 59:4
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

హెబ్రీ దేశం నుండి బలవంతంగా నన్ను దొంగిలించి తీసుకువచ్చారు, నేను చెరసాలలో ఉండడానికి చేసిన నేరం ఏమి లేదు” అని చెప్పాడు.


కారణం లేకుండా నాకు శత్రువులైనవారిని నన్ను చూసి సంతోషించనివ్వకండి. కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు దురుద్దేశంతో కన్నుగీట నివ్వకండి.


మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి.


ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర? లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి.


మీరు నాశనం చేస్తారు. రక్తపిపాసులను మోసగాండ్రను, యెహోవా అసహ్యించుకుంటారు.


వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి; దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి.


కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి, మనుష్యులను చంపడానికి త్వరపడతారు.


యెహోవా హస్తమా, మేలుకో మేలుకో, బలాన్ని ధరించుకో! పాత తరంలో ఉన్నట్లు గడచిన కాలంలో ఉన్నట్లు లేచిరా. రాహాబును ముక్కలుగా నరికింది నీవే కదా? సముద్రపు మృగాన్ని పొడిచింది నీవే కదా?


వారి కాళ్లు పాపంలోకి పరుగెత్తుతాయి; నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి వారు త్వరపడతారు. వారు దుష్ట పథకాలు అనుసరిస్తారు. హింస క్రియలు వారి మార్గాల్లో ఉన్నాయి.


కాబట్టి మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడకు రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు.


“వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి;


యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ