Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 56:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు. నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 56:8
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

“నీవు వెనుకకు తిరిగివెళ్లి నా ప్రజల అధిపతియైన హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను; నేను నిన్ను స్వస్థపరుస్తాను. మూడవ రోజున నీవు యెహోవా ఆలయానికి వెళ్తావు.


నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా నా మధ్యవర్తి నా స్నేహితుడు


ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.


నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి; నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.


“యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.


వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు, ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు; పూర్వ రోజులన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.


అయితే యెహోవా, నన్ను చంపడానికి వారు పన్నిన కుట్రలన్నీ మీకు తెలుసు. వారి నేరాలను క్షమించకండి మీ దృష్టి నుండి వారి పాపాలను తుడిచివేయకండి. వారిని మీ ఎదుట కూలనివ్వండి; మీరు కోపంలో ఉన్నప్పుడే వారికి తగిన శాస్తి చేయండి.


అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు కలిగినవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా విన్నారు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన పేరును గౌరవించే వారి విషయం ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడింది.


అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి.


తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, తోటి యూదుల వల్ల ఆపదలు, యూదేతరుల వల్ల ఆపదలు, పట్టణాల్లో, అడవుల్లో, సముద్రాల మీద ఆపదల్లో పడ్డాను; ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను.


వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము విదేశీయులమని అపరిచితులమని ఒప్పుకున్నారు.


ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వారు ఎడారుల్లో, పర్వతాల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగుతూ జీవించారు.


విశ్వాసం ద్వారానే అబ్రాహాము, తాను స్వాస్థ్యంగా పొందబోతున్న ప్రదేశానికి వెళ్లమని పిలువబడినపుడు ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకపోయినా అతడు బయలుదేరి వెళ్లాడు.


ఆ తర్వాత దేవుని సింహాసనం ముందు సామాన్యులు గొప్పవారితో సహా చనిపోయిన వారందరూ నిలబడి ఉండడం నేను చూశాను. గ్రంథాలు తెరవబడ్డాయి. వాటిలో జీవగ్రంథం అనబడే మరొక గ్రంథం తెరవబడింది. జీవగ్రంథంలో వ్రాయబడిన ప్రకారం చనిపోయినవారు తాము చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడ్డారు.


ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధించబడిన గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండి ‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’ ‘దేవుడు వారి కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు.’”


అలా దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చి సౌలు తనకు చేసినదంతా అతనికి చెప్పాడు. అప్పుడు అతడు అతనితో పాటు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివసించారు.


అయితే దావీదు తనలో తాను, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ