Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 56:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 నా దేవా! నాపై దయ చూపండి, ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు; రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మ్రింగవలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము. రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నా దేవా! నాపై దయ చూపండి, ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు; రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 56:1
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమి నోరు తెరిచి దాతానును మ్రింగివేసింది; అబీరాము గుంపును కప్పేసింది.


ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.


ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.


మీ మారని ప్రేమను బట్టి నా శత్రువులను మౌనం చేయండి; నేను మీ సేవకుని కాబట్టి, నా శత్రువులను నాశనం చేయండి.


నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.


మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు, మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు. యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు, ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది.


నన్ను మ్రింగివేయాలని దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నా శత్రువులు నా పగవారు తూలి పడిపోతారు.


యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి; నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి, నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి.


“ఆహా, మేము కోరుకున్నదే జరిగింది!” అని అనుకోనివ్వకండి, “మేము అతన్ని మ్రింగివేశాం” అని అననివ్వకండి.


పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా? మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా?


దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.


తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు. ఆయన నాకు ముందుగా వెళ్తారు నన్ను అపవాదు చేసిన వారిపై నేను సంతోషించేలా చేస్తారు.


దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!


పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం, సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం;


నీ శత్రువులందరూ నీకు వ్యతిరేకంగా నోరు విప్పారు. వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ, “మేము ఆమెను నాశనం చేశాము. ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది; దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు.


దయ లేకుండా ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. తన కోపంలో ఆయన తన కుమార్తెయైన యూదా కోటలను పడగొట్టారు. ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను అగౌరపరచి నేలకూల్చారు.


ప్రభువు ఒక శత్రువులా; ఇశ్రాయేలును నాశనం చేశారు. ఆమె రాజభవనాలన్నింటిని ఆయన కూల్చివేశారు, అలాగే ఆమె కోటలను నాశనం చేశారు. ఆయన యూదా కుమార్తె కోసం దుఃఖాన్ని, విలాపాన్ని అధికం చేశారు.


ఇశ్రాయేలు మ్రింగివేయబడింది; ఇప్పుడు అది ఎవరికీ ఇష్టం లేనిదానిగా, ఇతర దేశాల మధ్య ఉంది.


నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది.


అందుకు ఫిలిష్తీయుల సేనాధిపతులు ఆకీషుమీద కోప్పడి, “నీవు ఇతనికి కేటాయించిన పట్టణానికి ఇతన్ని తిరిగి పంపించు. ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు, ఒకవేళ వస్తే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనకే వ్యతిరేకంగా మారతాడేమో! ఇతడు తన యజమాని దయను తిరిగి పొందడానికి మనవారి తలలు తీసుకెళ్లడంకన్నా వేరే మంచి మార్గం ఏముంటుంది?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ