Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 53:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది! దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఇశ్రాయేలు ప్రజలారా, సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు? దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు యాకోబు సంతోషిస్తాడు. ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది! దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 53:6
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.


ఆ రోజు దేవుడు తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. స్త్రీలు పిల్లలు కూడా సంతోషించారు. యెరూషలేములోని ఈ సంతోష ధ్వనులు చాలా దూరం వరకు వినిపించాయి.


యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు.


సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది; యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!


సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, దేవుడు ప్రకాశిస్తారు.


యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు; యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు.


ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


ఆ దేశ దూతలకు ఇవ్వవలసిన జవాబు ఏది? “యెహోవా సీయోనును స్థాపించారు, ఆయన ప్రజల్లో శ్రమ పొందినవారు దానిని ఆశ్రయిస్తారు.”


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.


ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు, యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’


“ఆ దినాల్లో ఆ కాలంలో, నేను యూదా, యెరూషలేము వారిని తిరిగి రప్పించినప్పుడు,


నేను మీకు విరోధంగా నా ముఖం పెడతాను, తద్వార మీ శత్రువులతో ఓడిపోతారు; మిమ్మల్ని ద్వేషించేవారే మిమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు.


“ ‘మీలో మిగిలిన వారికైతే, వారి శత్రువుల దేశాల్లో గాలికి ఆకులు అల్లాడితే పారిపోవునంతగా వారి హృదయాలు ఎంతో భయపడేలా చేస్తాను. ఖడ్గం నుండి వారు పారిపోతున్నట్టు వారు పరుగెత్తుతారు, ఎవరు తరమకుండానే వారు పడిపోతారు,


నేను నా ఇశ్రాయేలు ప్రజలను బందీల నుండి తిరిగి తీసుకువస్తాను. “వారు శిథిలమైన పట్టణాలను పునర్నిర్మించుకుని వాటిలో నివసిస్తారు. వారు ద్రాక్షతోటలు వేసి వాటి ద్రాక్షరసం త్రాగుతారు; వారు వనాలు నాటి వాటి పండ్లు తింటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ