Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 51:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 నీ సంతోషాన్ని బట్టి సీయోనుకు మేలు చెయ్యి. యెరూషలేము గోడలను తిరిగి నిర్మించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము. యెరూషలేము గోడలను కట్టుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 51:18
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను.


ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి తన మహిమతో ప్రత్యక్షమవుతారు.


యెహోవా యెరూషలేమును కట్టిస్తారు; ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.


దేవా, ఇశ్రాయేలు ప్రజలను వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి.


అప్పుడు నేను ఇలా అన్నాను, “ఇదిగో నేను ఉన్నాను. గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాసి ఉంది.


ఎందుకంటే దేవుడు సీయోనును రక్షిస్తారు, యూదా పట్టణాలను తిరిగి కడతారు. అప్పుడు ప్రజలు అక్కడ నివసించి దానిని స్వాధీనం చేసుకుంటారు.


యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి.


పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు. అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు; మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా, నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.


సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.


ఖడ్గం నుండి తప్పించుకున్న వారలారా, వెళ్లిపొండి, ఆలస్యం చేయకండి! సుదూరదేశంలో ఉన్నాసరే, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి.”


“దీనిని తెలుసుకొని, గ్రహించు: యెరూషలేము పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం ఆజ్ఞ ఇయ్యబడింది మొదలుకొని, అభిషిక్తుడైన అధిపతి వచ్చేవరకు ఏడు ‘వారాలు,’ అరవై రెండు ‘వారాలు’ పడుతుంది. అయితే కష్టకాలంలో యెరూషలేము నడి వీధులతో, కాలువతో పునర్నిర్మించబడుతుంది.


వేల కొలది పొట్టేళ్ళూ, పదివేల నదులంత నూనెను అర్పిస్తే యెహోవా సంతోషిస్తారా? నా అతిక్రమం కోసం నా జ్యేష్ఠ కుమారున్ని, నా పాపం కోసం నా గర్భఫలాన్ని అర్పించాలా?


మీ గోడలు కట్టే రోజు వస్తుంది మీ సరిహద్దులు విశాలపరిచే రోజు వస్తుంది.


నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివసించి దానికి ఘనతగా ఉంటాను’ అని యెహోవా చెప్తున్నారు.


“చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు.


తన ప్రేమతో ముందుగానే, యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన సొంత కుమారులుగా స్వీకరించాలని ఆయన నిర్ణయించుకోవడం ఆయనకు ఎంతో ఇష్టాన్ని ఆనందాన్ని కలిగించింది.


క్రీస్తులో ఆయన ఉద్దేశించిన తన చిత్తాన్ని గురించిన మర్మాన్ని తన దయాసంకల్పానికి అనుగుణంగా మనకు తెలియజేశారు.


ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే.


దీన్ని హృదయంలో ఉంచుకుని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తిచేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ