Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 5:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు; వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు. మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా, మీరు వారిని కాపాడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 నీలో ఆశ్రయం కోరిన వాళ్ళు అందరూ సంతోషిస్తారు గాక. నువ్వు వారిని సంరక్షిస్తావు గనక వారు ఉప్పొంగిపోతారు గాక. నీ నామాన్ని ప్రేమించే వాళ్ళు నీలో ఆనందిస్తారు గాక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము. ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు; వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు. మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా, మీరు వారిని కాపాడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 5:11
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.


నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఆనంద సంతోషాలతో కేకలు వేయుదురు గాక; “తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించే యెహోవా ఘనపరచబడును గాక” అని వారు నిత్యం అందురు గాక.


అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.


ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు, దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు.


పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి; వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు.


కాని నీతిమంతులు సంతోషించి దేవుని ఎదుట ఆనందించుదురు గాక వారు సంతోషంగా ఆనందంగా ఉందురు గాక.


దేవుని సేవకుల సంతానం ఆ భూమిని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అక్కడ నివసిస్తారు.


సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.


దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు.


అయితే దీని గురించి: “ఎవరూ చూడని ఎవరూ వినని ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు” అని వ్రాయబడి ఉంది.


శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.


నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా?


“పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”


“యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి! అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.” తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ