Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 40:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహనబలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నీకు బలులన్నా, నైవేద్యాలన్నా సంతోషం ఉండదు. అయితే నువ్వు నా చెవులు తెరిచావు. దహన బలులుగానీ పాపం కోసం చేసే బలులు గానీ నీకు అక్కర లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు. బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు. దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 40:6
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి, గోతిలో పడకుండ వారిని కాపాడడానికి, ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు.


పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.


దేవా, మీ ఆలోచనలు నాకెంతో అమూల్యమైనవి! వాటి మొత్తం ఎంత విస్తారమైనది!


వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే, అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి, నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను.


మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి, నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను.


మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; మీరు దహనబలులను ఇష్టపడరు.


రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, రక్షణక్రియలను గురించి చెప్తుంది. అవి నా గ్రహింపుకు అందనివి.


వాని యజమాని వానిని దేవుని ఎదుటకు తీసుకురావాలి. వాని యజమాని వానిని తలుపు దగ్గరకు గాని ద్వారబంధం దగ్గరకు గాని తీసుకెళ్లి వాని చెవిని కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు వాని యజమానికి జీవితకాల దాసునిగా ఉంటాడు.


యెహోవా ఇలా అంటున్నారు, “విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో నాకు ఆనందం లేదు.


యెహోవా, మీరే నా దేవుడు; నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను, పరిపూర్ణ నమ్మకత్వంతో మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన అద్భుతాలను మీరు చేశారు.


అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;


ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు, దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.


మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.


‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు.


అందుకే మీరు వెళ్లి, ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి: ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను” అన్నారు.


అందుకు సమూయేలు ఇలా అన్నాడు: “ఒకడు తన మాటకు లోబడితే యెహోవా సంతోషించినంతగా, దహనబలులు బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తారా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం ఎంతో మంచిది


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ