Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 39:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 “యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యెహోవా, నా ప్రార్థన విను. నేను చెప్పేది విను. నా రోదనను పట్టించుకో. చెవిటివాడిలాగా ఉండకు. నీ ఎదుట నేను పరదేశిలా ఉన్నాను. నా పూర్వీకులందరిలాగ శరణార్ధిలాగా ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నేను నీకు మొరపెట్టే మాటలు వినుము. నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు. నేను దాటిపోతున్న ఒక అతిథిని. నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 “యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 39:12
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.


యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు.


యెహోవా నా బాధ చూసి, ఈ రోజు ఇతడు పలికిన శాపాలకు బదులుగా నాకు మంచి చేస్తాడేమో!” అని అన్నాడు.


“నీవు వెనుకకు తిరిగివెళ్లి నా ప్రజల అధిపతియైన హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను; నేను నిన్ను స్వస్థపరుస్తాను. మూడవ రోజున నీవు యెహోవా ఆలయానికి వెళ్తావు.


మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది.


మురిగి కుళ్ళిపోతున్న దానిలా, చిమ్మెటలు కొట్టిన వస్త్రంలా మనిషి నాశనమవుతాడు.


నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా నా మధ్యవర్తి నా స్నేహితుడు


యెహోవా, నా ప్రార్థన వినండి; సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.


మరణపాశాలు నన్ను చుట్టివేశాయి, సమాధి వేదన నా మీదికి వచ్చింది. బాధ దుఃఖం నన్ను అధిగమించాయి.


ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి.


నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము.


నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?


మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి; మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము.


“ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు.


కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.


వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము విదేశీయులమని అపరిచితులమని ఒప్పుకున్నారు.


యేసు భూమి మీద జీవించిన రోజుల్లో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీటితో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.


పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పు తీర్చే దేవున్ని మీరు తండ్రీ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో విదేశీయులుగా మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.


ప్రియ మిత్రులారా, ఈ లోకంలో విదేశీయులుగా, ప్రవాసులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కాబట్టి వాటికి విడిచిపెట్టండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ