Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 38:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు నా కోసం ఉచ్చు బిగిస్తున్నారు. నాకు హాని కలగాలని చూసేవాళ్ళు వినాశకరమైన మాటలు పలుకుతున్నారు. రోజంతా మోసపూరితంగా మాట్లాడుతున్నారు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు. వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 38:12
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఆయన నా సహోదరులను నాకు దూరం చేశారు; నా పరిచయస్థులందరూ నాకు పూర్తిగా పరాయివారయ్యారు.


గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.


దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు.


అహంకారులు చాటుగా వల ఉంచారు; వారు వల దాడులు పరచారు, నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా


కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.


చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; నేను పగిలిన కుండలా అయ్యాను.


వారు సమాధానంగా మాట్లాడరు, దేశంలో ప్రశాంతంగా నివసించే వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తారు.


నా ప్రాణాన్ని తీయాలని చూసేవారు అవమానపాలై సిగ్గుపడుదురు గాక; నా పతనానికి కుట్రపన్నిన వారు భయపడుదురు గాక.


నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.


అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు; దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. సెలా


మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక.


దుఃఖంతో నా కళ్లు మసకబారాయి. యెహోవా, ప్రతిరోజు నేను మీకు మొరపెడుతున్నాను; మీ వైపు నా చేతులు చాచాను.


పేదవారిని తమ బంధువులందరు దూరంగా ఉంచుతారు, అలాంటప్పుడు వారి స్నేహితులు ఇంకెంత దూరంగా ఉంచుతారు! పేదవారు బ్రతిమిలాడుతూ వారిని వెంటాడినా, వారు ఎక్కడా కనిపించలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ