Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 30:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు. నాకు “జీవం” ప్రసాదించాడు. రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను. మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 30:5
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారే వరకు ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు.


ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,


ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు, శాశ్వతంగా కోపం పెట్టుకోరు;


నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.


యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది; నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.


మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.


అందులో దేవుడున్నారు, అది కూలదు; తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.


దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి.


కానీ నేను మీ బలాన్ని గురించి పాడతాను, ఉదయం మీ ప్రేమను గురించి పాడతాను; ఎందుకంటే మీరు నా కోట, కష్ట సమయాల్లో నా ఆశ్రయము.


మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.


నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి.


దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి. “ఇదే నా నిత్యమైన పేరు, తరతరాల వరకు మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.


ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీరు నాపై కోప్పడినా కూడా మీ కోపం చల్లారింది మీరు నన్ను ఆదరించారు.


నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి మీ వెనక తలుపులు వేసుకోండి; ఆయన ఉగ్రత పోయే వరకు కొంతకాలం మీరు దాక్కోండి.


మనం యెహోవా గురించి తెలుసుకుందాం; ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సూర్యోదయం ఎంత నిశ్చయమో, ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; ఆయన శీతాకాలం వర్షాల్లా, భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”


దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.


మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.


అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు.


“రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ