Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 27:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే, నా తల పైకెత్తబడుతుంది ఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను; నేను పాడి యెహోవాను స్తుతిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను. యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే, నా తల పైకెత్తబడుతుంది ఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను; నేను పాడి యెహోవాను స్తుతిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 27:6
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు.


మూడవ రోజు ఫరో పుట్టిన రోజు, అతడు తన అధికారులందరికి విందు ఏర్పాటు చేశాడు. అధికారులందరి ఎదుట గిన్నె అందించేవారి నాయకుడి, రొట్టెలు కాల్చేవాని నాయకుడి తలలను పైకెత్తాడు:


యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు.


నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.


నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.


యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, పన్నెండవ నెల, ఇరవై ఏడవ రోజున ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, అతడు యూదా రాజైన యెహోయాకీనును చెరసాల నుండి విడిపించాడు.


అతడు వారితో ఇలా అన్నాడు, “మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నారు కదా? అన్నివైపులా ఆయన మీకు విశ్రాంతి ఇచ్చారు కదా? ముందున్న దేశవాసులను ఆయన నా చేతికి అప్పగించారు కాబట్టి ఇప్పుడు దేశం యెహోవాకు, ఆయన ప్రజలకు స్వాధీనం అయింది.


కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి.


దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు, కాబట్టి అతడు తల పైకెత్తుతాడు.


యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి.


యెహోవా మహిమ గొప్పది కాబట్టి, వారు యెహోవా యొక్క మార్గాల గురించి పాడుదురు గాక.


యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు. మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!


యెహోవా, మీ బలంలో మీరు లేవండి; మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము.


కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.


నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా


సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి.


నా ప్రాణమా, మేలుకో! సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.


మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి; యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి!


రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


యెహోవా ఇలా అంటున్నారు: “యాకోబు కోసం ఆనందంగా పాడండి; దేశాల్లో గొప్పదాని కోసం కేకవేయండి. స్తుతులు చెల్లిస్తూ, ‘యెహోవా, ఇశ్రాయేలీయులలో మిగిలిన, నీ ప్రజలను రక్షించండి’ అని అనండి.


సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు.


సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.


కాబట్టి, యేసు ద్వారా, ఆయన పేరును బహిరంగంగా ఒప్పుకునే పెదవుల ఫలంతో మనం నిరంతరం దేవునికి స్తుతి బలిని అర్పిద్దాము.


మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.


వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ, “మా ప్రభువైన సర్వశక్తిగల దేవా! నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి! సకల రాజ్యాలకు రాజా! నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి!


వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ