Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 21:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నిశ్చయంగా మీరు అతనికి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చారు మీ సన్నిధిలోని ఆనందంతో అతన్ని సంతోష పెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లిసింపజేసి యున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 శాశ్వత ఆశీర్వాదం నువ్వు అతనికి మంజూరు చేశావు. నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో అతన్ని సంతోషపరిచావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు. నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నిశ్చయంగా మీరు అతనికి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చారు మీ సన్నిధిలోని ఆనందంతో అతన్ని సంతోష పెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 21:6
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

“నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను; నీ పేరును గొప్పగా చేస్తాను, నీవు దీవెనగా ఉంటావు.


నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.


ఇప్పుడు మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించడం మీకు ఇష్టమైనది; ఎందుకంటే యెహోవా, మీరు దానిని దీవిస్తే అది శాశ్వతంగా దీవించబడుతుంది.”


మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.


అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను, నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను. దేవా! నా దేవా! వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.


మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు.


మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’


దేవుడు తన సేవకుని లేపినప్పుడు, మీలో అందరిని దుష్ట మార్గాల నుండి తప్పించి మిమ్మల్ని దీవించడానికి ఆయనను మొదట మీ దగ్గరకు పంపించారు.”


విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకునేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా వర్తించాలని ఆయన మనల్ని విమోచించారు.


అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు.


మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. పరలోక మండలాల్లో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో క్రీస్తులో ఆయన మనల్ని దీవించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ