Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 132:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: “మీ సంతానంలో ఒకనిని మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 –నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినయెడల వారి కుమారులు కూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు. దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: “మీ సంతానంలో ఒకనిని మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 132:11
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.


నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.


నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”


‘ఈ రోజు నా సింహాసనం మీద ఒక వారసుడు కూర్చోవడం నేను కళ్లారా చూసేలా చేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక’ అన్నాడు” అని చెప్పాడు.


“ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నమ్మకంగా జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి.


“ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి.


నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని నిబంధన చేసినట్లు నీ రాజ సింహాసనం ఎల్లకాలం స్థాపిస్తాను.


“మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు.


అయితే వారికి నా ప్రేమను పూర్తిగా దూరం చేయను, నా నమ్మకత్వాన్ని ఎన్నటికి విడిచిపెట్టను.


నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను, నేను దావీదుతో అబద్ధం చెప్పను.


ఆకాశంలో విశ్వసనీయమైన సాక్ష్యంగా ఉన్న చంద్రునిలా, అది శాశ్వతంగా స్థిరపరచబడి ఉంటుంది” అని అన్నాను. సెలా


యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి, అలాగే పరిశుద్ధుల సభలో మీ నమ్మకత్వం స్తుతించబడుతుంది.


అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట్లాడి క్రియ చేయరా? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?


ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు.


అతడు ఒక ప్రవక్త దేవుడు అతని సంతానంలో ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని ఒట్టు పెట్టుకుని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు.


దేవుడు అబద్ధమాడడం అసాధ్యమైన రెండు మార్పులేని విషయాల ద్వారా, మన ముందు ఉంచిన నిరీక్షణను పట్టుకోవడానికి పరుగెత్తిన మనల్ని ఎంతో ప్రోత్సహించగలిగేలా, దేవుడు ఇలా చేశారు.


ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్నవాడు అబద్ధమాడడు మనస్సు మార్చుకోడు; మనస్సు మార్చుకోడానికి ఆయన నరుడు కాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ