Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 120:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వీరుల పదునైన బాణాలతో, మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 తంగేడునిప్పులతోకూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని, మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వీరుల పదునైన బాణాలతో, మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 120:4
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

పదునైన మీ బాణాలు శత్రురాజుల గుండెలను చీల్చుకునిపోతాయి. మీ పాదాల క్రింద జనాలు కూలి పడతారు.


ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా


నేను సింహాల మధ్య ఉన్నాను; నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు, వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి.


వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి; వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి, “మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు.


ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.


తన పొరుగువానిని గేలి చేసేవారు బుద్ధిహీనులు, కాని వివేకులు తమ నాలుకను అదుపులో పెట్టుకుంటారు.


దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు, కానీ నీతిగా జీవించేవారు నిజంగా ప్రతిఫలాన్ని పొందుతారు.


దుష్టులువాడు తన నోటి మాట వలన తన పొరుగువానికి నాశనం కలుగుతుంది, తెలివిచేత నీతిమంతులు తప్పించుకుంటారు.


అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు.


పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు, వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి.


చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి, దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు.


పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.


అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు అబద్ధాలాడే వాడు తప్పించుకోడు.


అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.


కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను, నా ప్రజల పాపాన్ని బట్టి అంతకన్నా నేనేం చేయగలను?


అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ