Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 7:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 నా కుమారుడా, నా మాటలు పాటించు, నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 కుమారా, నా మాటలు నీ మనసులో ఉంచుకో. నా ఆజ్ఞలు నీ దగ్గర పదిలంగా దాచుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 నా కుమారుడా, నా మాటలు జ్ఞాపకం ఉంచుకో నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు మరువకు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నా కుమారుడా, నా మాటలు పాటించు, నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 7:1
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో.


నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను నీ తల్లి బోధను త్రోసివేయవద్దు.


జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.


నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు, నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో,


నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు, నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో.


దాని పాదాలు మరణానికి దిగుతాయి; దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి.


నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు.


అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.


అందుకు యేసు, “అది నిజమే, కానీ దానికంటే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపేవారు ఇంకా ధన్యులు” అని చెప్పారు.


అయితే మంచి నేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.


అందుకు యేసు, “ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము.


నేను మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి: ‘ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడు.’ వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా బోధకు లోబడి ఉంటే, వారు మీ బోధకు కూడా లోబడుతారు.


మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడకుండా, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం.


సమయం సమీపంగా ఉంది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు.


కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కాబట్టి దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ