Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 30:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 30:12
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు; నేను శుద్ధుడను పాపం లేనివాడను.


తమ పాపం బయటపడి దాన్ని ద్వేషించే వరకు వారు తమను తాము పొగడుకొంటారు.


నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.


హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను; నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను.


ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.


ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు, కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు.


“మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.


వారు, ‘నా దగ్గరకు రావద్దు. దూరంగా ఉండండి, మీకంటే నేను ఎంతో పరిశుద్ధున్ని’ అని అంటారు. అలాంటివారు నా నాసిక రంధ్రాలకు పొగలా, రోజంతా మండే నిప్పులా ఉన్నారు.


నీవు, ‘నేను నిర్దోషిని; ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు. ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు, కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను.


యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు. మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు?


నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను.


“మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లు నేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను.


“ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది.


ఆయన వారితో, “మీరు మనుష్యుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకుంటారు గాని దేవుడు మీ హృదయాలను ఎరిగి ఉన్నాడు. మనుష్యులు అధిక విలువ ఇచ్చేవి దేవుని దృష్టికి అసహ్యము.


పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థించాడు: ‘దేవా, నేను దొంగలు, అన్యాయస్థులు వ్యభిచారుల వంటి ఇతరుల్లా కాని, ఈ పన్నులు వసూలు చేసేవాని వలె కాని లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.


మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.


దైవభక్తి కలిగి ఉన్నా దాని శక్తిని నమ్మనివారిగా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండు.


ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు.


నమ్మకమైన సాక్షిగా మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి,


మీకా, “ఈ లేవీయుడు నా యాజకుడయ్యాడు, కాబట్టి ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తారని నాకు తెలుసు” అన్నాడు.


మీకా అనే ఈ వ్యక్తికి క్షేత్రం ఒకటి ఉన్నది, అతడు ఒక ఏఫోదును, మరికొన్ని గృహ దేవుళ్ళ విగ్రహాలను చేయించి, తన కుమారులలో ఒకనిని తన యాజకునిగా నియమించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ